Telangana Rains: తగ్గేలే దే అంటున్న వరుణుడు.. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. గోదావరి తీరంలో భయంభయం

Telangana Rains: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు తాజాగా వాతావరణ శాఖ రెడ్ అలెర్జ్ జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Written by - Srisailam | Last Updated : Jul 18, 2022, 10:08 AM IST
  • తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు
  • 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్
  • గోదావరి తీరంలో భయంభయం
Telangana Rains: తగ్గేలే దే అంటున్న వరుణుడు.. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. గోదావరి తీరంలో భయంభయం

Telangana Rains: వారం రోజుల పాటు నాన్ స్టాప్ గా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. జూలై చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తెలంగాణలో కురవాల్సిన వర్షం కంటే 120 శాతం అధిక వర్షం కురిసింది. కుండపోత వానలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలంలో నీటిమట్టం ఏకంగా 71.8 అడుగుల వరకు చేరింది. 25 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహించింది. గోదారమ్మ ఉప్పొంగడంతో తీర గ్రామాలు వణికిపోయాయి. వందలాది గ్రామాలు నాలుగైదు రోజుల పాటు నీటిలో ఉన్నాయి. అయితే రెండు రోజుల పాటు వర్షాలు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి నీటిమట్టం తగ్గింది. ముంపు గ్రామాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వరద గండం తప్పిందని అందరూ ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో తెలంగాణపై మళ్లీ వరుణుడు పంజా విసురుతున్నాడు.

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు తాజాగా వాతావరణ శాఖ రెడ్ అలెర్జ్ జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల వరకు కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో అత్యధికంగా 114 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. గాంధారిలో 109, రామలక్ష్మణ్ పల్లిలో 100, తాడ్వాయిలో 91, నిజామాబాద్ జిల్లా మొస్రాలో 80, సాలోరాలో 78 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, కుత్బుల్లాపుర్, శేరిలింగం పల్లి నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో ముసురు పట్టింది. చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.

రికార్డ్ స్థాయిలో వరదల నుంచి కాస్త కోలుకున్న గోదవరి తీర గ్రామాలు ఐఎండీ తాజా హెచ్చరికలతో మళ్లీ వణికిపోతున్నారు. రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాలన్ని గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాలోనే ఉండటంతో మళ్లీ గోదారమ్మ ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. సోమవారం ఉదయానికి భద్రాచలంలో గోదావర నీటిమట్టం 57 అడుగులకు తగ్గింది. మూడో ప్రమాదక హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ కాళేశ్వరం నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. అయితే తాజా వర్ధాలతో గోదావరికి మళ్లీ వరద పెరిగే అవకాశాలు ఉండటంతో తీర గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఇంకా వందలాది గ్రామాలు ముంపులోనే ఉన్నాయి.

Read also: TS EAMCET 2022: నేడు తెలంగాణ ఎంసెట్.. వర్షాలతో ప్రత్యేక ఏర్పాట్లు... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Read also: Cloud Busrt: క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమా? గోదావరిపై కుట్ర జరిగిందా?  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News