Penalty on no mask: మాస్క్ లేకుండా రోడ్డుపై వస్తే..భారీ జరిమానా తప్పదిక

Penalty on no mask: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం. మాస్క్ లేకపోతే భారీ జరిమానా విధిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 30, 2021, 03:46 PM IST
Penalty on no mask: మాస్క్ లేకుండా రోడ్డుపై వస్తే..భారీ జరిమానా తప్పదిక

Penalty on no mask: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం. మాస్క్ లేకపోతే భారీ జరిమానా విధిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. కరోనా గైడ్‌లైన్స్ (Corona guidelines) పాటించని పక్షంలో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ (Ghmc) పరిధిలో మాస్క్ లేకుండా నగర రోడ్లపై కన్పిస్తే భారీ జరిమానాలు విధించనున్నారు. ముందుగా ఫోటోలు తీసి..బండి నెంబర్ ప్రకారం ఇంటికి చలానాలు పంపించేస్తారు. దీనికోసం ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మాస్క్ లేకుండా ఎవరైనా బయట కన్పిస్తే భారీ జరిమానా ( Penalty on not wearing mask) విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు.

జంట నగరాల్లోని మూడు కమీషనరేట్ల పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు మాస్క్ (No Mask) లేకుండా వెళ్తున్నవారి ఫోటోలు తీసి వాహనం నెంబర్ ఆధారంగా ఇంటికి నేరుగా చలానాలు పంపించనున్నారు. జరిమానా ఎంతనేది ఇంకా నిర్ణయించలేదు. ఇప్పటికే మాస్క్ లేకుండా వాహనాల్లో వెళ్తున్నవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 15 వేల కేసులు నమోదు చేశారు. మాస్క్ లేకుండా తిరిగివారిని గుర్తించడంలో సీసీ కెమేరాలు కీలకపాత్ర పోషించనున్నాయి.

Also read: COVID-19 Cases: తెలంగాణలో నిన్న ఒక్కరోజు 463 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News