Hyderabad Metro Offer: ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.59తో రోజంతా మెట్రో ప్రయాణం! కండిషన్ అప్లై!

Hyderabad Metro Super Saver Card Offer. ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో అధికారులు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. సెలవు రోజుల్లో ఉపయోగించుకునేలా 'సూపర్ సేవర్' కార్డును హైదరాబాద్‌ మెట్రో అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 05:31 PM IST
  • మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌
  • రూ.59తో రోజంతా మెట్రో ప్రయాణం
  • ప్రయాణికులారా కండిషన్ అప్లై
Hyderabad Metro Offer: ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.59తో రోజంతా మెట్రో ప్రయాణం! కండిషన్ అప్లై!

Hyderabad Metro Launched Rs 59 Super Saver Card for passengers: ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో అధికారులు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. సెలవు రోజుల్లో ఉపయోగించుకునేలా 'సూపర్ సేవర్' కార్డును హైదరాబాద్‌ మెట్రో అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్డును ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి ఈరోజు ప్రారంభించారు. సూపర్ సేవర్ కార్డుతో సెలవుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చని ఆయన తెలిపారు. అయితే మెట్రో అధికారులు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మెట్రో ఎండీ చెప్పారు.

ఉగాది రోజు నుంచి మెట్రోలో సూపర్‌ సేవర్‌ కార్డులు విక్రయించనున్నట్లు ఎండీ కె.వి.బి.రెడ్డి ప్రకటించారు. సూపర్‌ సేవర్‌ కార్డుతో న‌గ‌రంలో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా రోజంతా తిర‌గొచ్చ‌ని ఆయన తెలిపారు. దాంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల కోసం హైదరాబాద్‌ మెట్రో గతంలో కూడా పలు ఆఫర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలు పుంజుకున్నా.. మరింత మంది ప్రయాణికులను ఆకర్షించడం కోసమే ఈ ఆఫర్ తీసుకొచ్చారు. 

మెట్రో ప్రకటించిన సెలవులు ఇవే:
# ప్రతి ఆదివారం
# ప్రతి రెండు, నాలుగో శనివారం
# ఉగాది
# రంజాన్
# మొహర్రం
# బోనాలు
# ఆగష్టు 15
# వినాయక చవితి
# కృష్ణాష్టమి
# దుర్గాష్టమి
# దసరా
# దీపావళి
# బాక్సింగ్‌డే
# బోగీ
# సంక్రాంతి
# శివరాత్రి

Also Read: Ramdev on Petrol: నోరు మూసుకో.. మళ్లీ అడిగితే బాగుండదు! లైవ్‌లోనే జర్నలిస్టుపై రామ్‌దేవ్‌ ఫైర్!!

Also Read: KGF 2 Dialogues: 'కేజీఎఫ్ 2' సినిమాకు డైలాగ్స్ రాసిన స్టార్ హీరో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News