Huzurabad bypolls: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కే నా మద్దతు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Huzurabad bypolls, Konda Vishweshwar Reddy supports Etela Rajender: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తాను ఈటల రాజేందర్‌కు మద్ధతు పలుకుతున్నట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2021, 07:19 AM IST
Huzurabad bypolls: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కే నా మద్దతు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Huzurabad bypolls, Konda Vishweshwar Reddy supports Etela Rajender: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తాను ఈటల రాజేందర్‌కు మద్ధతు పలుకుతున్నట్టు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. 

Space for an other regional party- తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ:
తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీకి అవకాశాలున్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ (CM KCR) వ్యతిరేకులంతా ఒకే వేదిక మీదకు రావాల్సిన అవసరం ఉందని చెబుతూ.. రాష్ట్రంలో ఒకే ప్రాంతీయ పార్టీ ఉండడం వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న కొండా (Konda Vishweshwar Reddy).. అందుకోసం తన వంతు ప్రయత్నంగా అందరిని సంప్రదిస్తానని తెలిపారు. 

Also read : Bandi Sanjay slams CM KCR: బీజేపికి భయపడే కేసీఆర్ జిల్లాల పర్యటనలు: బండి సంజయ్

ఇదిలావుంటే, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటికి రావడానికంటే ముందే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweswar reddy meets Etela Rajender).. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తన మద్దతు ఉంటుందని అప్పట్లోనే తెలిపారు. ఈటల రాజేందర్‌తో భేటీపై అప్పట్లో మీడియా వివరణ కోరగా.. ఈటల సతీమణి జమున రెడ్డి (Etela Rajender's wife Jamuna) తమ కుటుంబానికి బంధువు అవుతారని.. వారికి సానుభూతి తెలిపేందుకే వచ్చానని ఆ సందర్భంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Also read : సీఎం అయ్యే అర్హతలు Eetela Rajender, హరీష్‌ రావులకు మాత్రమే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News