Graduate MLC Election: తీన్మార్‌ మల్లన్న వర్సెస్‌ రాకేశ్‌ రెడ్డి.. ఉత్కంఠ రేపుతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం

Warangal Khammam Nalgonda Graduate MLC Election Rakesh Reddy Vs Teenmaar Mallanna: తెలంగాణలో మరో ఎన్నికల ఫలితం ఉత్కంఠ కలిగిస్తోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగ్గా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 5, 2024, 04:16 PM IST
Graduate MLC Election: తీన్మార్‌ మల్లన్న వర్సెస్‌ రాకేశ్‌ రెడ్డి.. ఉత్కంఠ రేపుతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం

Graduate MLC Election: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ముగియగా.. తెలంగాణలో మరో ఎన్నికల ఫలితం ఉత్కంఠ రేపుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేగా జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎన్నికవడంతో తన పట్టభద్ర ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో ఇక్కడ నిర్వహించిన ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి పోటీ పడుతున్నారు.

Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్‌ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం

 

బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. నల్లగొండలోని దుప్పలపల్లి  వేర్ హోసింగ్ గోదాములో కౌంటింగ్ ప్రక్రియను ఓట్ల లెక్కింపు ఎన్నికల సంఘం చేపట్టింది. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ శాతం 72.44 నమోదైంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు బ్యాలెట్‌ బండిల్స్ కట్టె ప్రక్రియ చేశారు. అనంతరం ఆ కట్టలను లెక్కించే పని ప్రారంభించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో పాటు చెల్లని ఓట్లను మొదట తొలిగిస్తారు. 

Also Read: Mahabubnagar Lok Sabha Election Result: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం

 

ఒక టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున 96 టేబుల్స్‌పై 96 వేల ఓట్ల లెక్కింపు చేస్తారు. మొత్తం నాలుగు రౌండ్స్‌లో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పెద్ద ప్రహసనం. ఈ ఓట్లు లెక్కించడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ ఓట్ల లెక్కింపు కొన్ని గంటల పాటు జరుగుతుండడంతో అర్ధరాత్రి 12 గంటలకు ఫలితం వెలువడే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యం ఓట్లలో బాగంగా అభ్యర్థికి కోటా ఓట్లు రాని పరిస్థితిలో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తారు. రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించడం ప్రారంభిస్తే ఫలితం మరో రెండు రోజుల తర్వాత వెలువడే అవకాశం ఉంది.

లెక్కింపు ప్రక్రియ ఇలా
నల్గొండలోని  వేర్ హౌసింగ్ గోదాములోని 4 హాల్స్‌లో మొత్తం  96 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్  ఓట్లను కూడా కలిపి లెక్కిస్తారు. 24 గంటల  పాటు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు దశల వారీగా సిబ్బంది పనిచేయనున్నారు. ఒక్కో షిఫ్ట్‌లో  900 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 3 వేల మంది సిబ్బంది బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తున్నారు.

మొత్తం పోలైన ఓట్లు: 3,36,013
పోస్టల్ బ్యాలెట్స్: 2,139

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News