Telangana Rains Alert: వాయువ్య బంగాళాఖాతంలో మరో రెండ్రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది. పలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3-5 రోజులపాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్లపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అప్రమత్తత జారీ అయింది. ఇప్పటికే నిన్నటి నుంచి తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఇవాళ్టి నుంచి 5 రోజులపాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశంవైపుగా వీస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఈ నెల 14, 15 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఉత్తర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఆసియా నుంచి వస్తున్న గాలులతో ఏపీ, తెలంగాణలకు మేఘాలు తరలిరానున్నాయి. అందుకే ఈ రెండు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం వాయువ్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర సముద్రతీరాల వరకూ, అటు దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకూ విస్తరించింది. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీల్లో రానున్న 3-5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది.
Also read: Heavy Rains: ఏపీలో మూడ్రోజులపాటు వర్షాలు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook