'కరోనా వైరస్' మహమ్మారి ప్రపంచాన్ని కుదుపేస్తోంది. దీని నుంచి కాపాడు దేవుడా..! అని ప్రపంచవ్యాప్తంగా జనం ఎదురు చూస్తున్నారు. కానీ భూమి మీద మనుషుల రూపంలో ఉన్న దేవుళ్లు వైద్యులు. అవును.. అందుకే ఇప్పుడు వారికే జనం మొక్కుతున్నారు. తమను కాపాడాలని వేడుకుంటున్నారు.
వైద్యులు, వైద్య సిబ్బంది.. ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా మహమ్మారి నుంచి జనాన్ని రక్షిస్తున్నారుత. వీలైనంత వరకు ప్రాణదానం చేస్తూ.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాలను కూడా వారు లెక్క చేయడం లేదు. అందుకే ఈ రోజు వైద్యులు, వైద్య సిబ్బందికి అభినందనలు తెలుపుతూ భారత త్రివిధ దళాలు గగన తలం నుంచి పూలవర్షం కురిపించాయి. ఐతే తెలంగాణలోనూ నిన్న అరుదైన సంఘటన జరిగింది.
గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్ విజయ శ్రీ .. నిన్న విధులు ముగించుకుని ఇంటికి వెళ్లారు. ఐతే ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె అపార్టుమెంట్లోకి అడుగుపెట్టగానే కరతాళ ధ్వనులతో స్వాగతించారు. ఇందులో ఆమె కుటుంబ సభ్యులతోపాటు ఇరుగుపొరుగు అంతా పాల్గొన్నారు.
గాంధీ ఆస్పత్రిలో విధులు ముగించుకొని ఇంటికి చేరిన డాక్టర్ విజయ శ్రీకి కరతాళ ధ్వనులతో ఘనస్వాగతం
కరోనా యోధులను గౌరవిస్తోన్న తెలంగాణ జనం👏👏👏#IndiaFightsCorona pic.twitter.com/ztBDlWhUJV
— BJP Telangana (@BJP4Telangana) May 3, 2020
గాంధీ ఆస్పత్రిలోనే ఆమె నిరంతరం వైద్య సేవలు అందిస్తూ .. దాదాపు 20 రోజుల తర్వాత ఇంటికి వచ్చారు. రాగానే ఆమెను అంతా ఆశ్చర్యానికి గురి చేశారు. అంతా కరతాళ ధ్వనులతో స్వాగతించే సరికి ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. కంటనీరు పెట్టుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..