Telangana Governer: తెలంగాణ గవర్నర్, టీఆర్ఎస్ సర్కార్ మధ్య వార్ మరింత ముదురుతోంది. కొన్ని రోజులుగా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ కొనసాగుతోంది. రోజు రోజుకు పెరిగిపోతోంది. తనను కేసీఆర్ సర్కార్ అవమానిస్తోందని ఓపెన్ గానే ఆరోపణలు చేస్తున్న గవర్నర్ తమిళి సై.. తాను కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన సమావేశాల్లో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళి సై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఏకంగా రాజ్ భవన్ లోనే కార్యక్రమం తలపెట్టారు.
సెప్టెంబర్ 17పై టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధం సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజున విడివిడిగా, పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తొలిసారి అధికారికంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. సెప్టెంబర్ 17న సమైక్యతా దినోత్సవంగా జరుపుతోంది తెలంగాణ సర్కార్. ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకలు జరుపుతోంది, అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 17ను నిర్వహించబోతోంది గవర్నర్ తమిళి సై. కేసీఆర్ సర్కార్ జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుతుండగా.. గవర్నర్ మాత్రం తెలంగాణ విమోచనం దినోత్సవం జరపబోతున్నారు.
సెప్టెంబర్ 17న రాజ్ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేశారు గవర్నర్ తమిళి సై. ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ విమోతన ఉద్యమం- పోరాటాలు- త్యాగాలు అనే అంశంపై యూనివర్శిటీ విద్యార్థులతో వ్యక్తిత్వ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ రాజ్ భవన్ లో మరిన్ని కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ సమైక్యతా దినోత్సవం జరుపుతుండగా.. గవర్నర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం హాట్ హాట్ గా మారింది.
Also read: BJP VS TRS: అమిత్ షాకు షాకిచ్చిన టీఆర్ఎస్.. సెప్టెంబర్17న రచ్చ రచ్చేనా?
Also read: AP Cabinet: కేబినెట్‌లో స్థానం కోల్పోతున్న ఆ మహిళా మంత్రి ఎవరు, ఆ ఇద్దరికీ మళ్లీ ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook