Sri Rama Navami Kalyanam Tickets in online: భద్రాచలం ఆలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతుంది. ఇందులో భాగంగానే రాములవారి ఆలయంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో సీతారాముల కల్యాణం జరపనున్నారు. ఈవేడుకను భక్తులు వీక్షించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన టికెట్లును నేటి నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు.
ఈ టికెట్లును www.bhdrachalamaonline.com వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. రూ.7,500, రూ.2,500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఏడువేల ఐదువందల టికెట్ పై ఇద్దరికీ ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా టికెట్లపై ఒకరి మాత్రమే ప్రవేశించే వీలుంది. టోటల్ గా 16,860 మంది టెకట్లతో మండపంలోనూ, 15వేల మంది స్టేడియం నుంచి ప్రీగా రాములోరి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఈనెల 31న శ్రీరామ సామాజ్ర్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మూడు రకాల టికెట్లను విక్రయించనున్నారు.
Also Read: Holi 2023: 30 ఏళ్ల తర్వాత హోలీ రోజున అరుదైన యాదృచ్చికం.. ఈ రాశులపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.