Boyfriend attacks : ప్రియురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థం.. ప్రియుడి దాడి

Boyfriend attacks on her in Hyderabad hastinapuram: మూడు నెలల క్రితం ఆ అమ్మాయికి మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ (Engagement) అయ్యింది. అయితే తమ కూతురి, బస్వరాజ్‌ ప్రేమ గురించి తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు నిశ్చితార్థం అయిపోయిన వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని (Hyderabad) హస్తినాపురంలో (hastinapuram) ఉండే బంధువుల ఇంట్లో ఉంచారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 07:39 PM IST
  • తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయ్యిందనే అక్కసుతో ప్రియుడి దాడి
  • హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో ఘటన
  • మూడు నెలల క్రితం ఆ అమ్మాయికి మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్
  • ప్రియురాలిపై కత్తితో విచక్షణరహితంగా దాడి
Boyfriend attacks : ప్రియురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థం.. ప్రియుడి దాడి

Girlfriend engaged to another man .. Boyfriend attacks on her in Hyderabad hastinapuram: తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయ్యిందనే అక్కసుతో ప్రియుడు ఆమెపై దాడి చేశాడు. కత్తితో (KNIFE) పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ (lb nagar‌)ఠాణా పరిధిలో బుధవారం చోటు జరిగింది. 

వికారాబాద్‌ జిల్లా (Vikarabad District) దౌల్తాబాద్‌ మండలంలోని చంద్రకల్‌కు చెందిన ఇరవై ఏళ్ల యువతి, అదే మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి (Thimmareddy village) చెందిన బస్వరాజ్ (23) (Baswaraj) కొంతకాలంగా లవ్‌లో ఉన్నారు. వీరి ప్రేమకు పెద్దల నుంచి అడ్డంకులు వచ్చాయి. అమ్మాయి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు.

Also Read : Mariyamma lockup death case: మరియమ్మ కేసు విషయంలో హైకోర్టు సీరియస్

ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఆ అమ్మాయికి మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ (Engagement) అయ్యింది. అయితే తమ కూతురి, బస్వరాజ్‌ ప్రేమ గురించి తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు నిశ్చితార్థం అయిపోయిన వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని (Hyderabad) హస్తినాపురంలో (hastinapuram) ఉండే బంధువుల ఇంట్లో ఉంచారు. 

అయితే ఈ విషయం బస్వరాజ్‌కు తెలుసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం తన ప్రియురాలు (Girlfriend) ఉంటున్న ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. ఆమెపై కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. 

ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి (Private hospital) తీసుకెళ్లారు. దాడి తర్వాత నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి కోలుకుంటున్నట్లు పోలీసులు (Police) పేర్కొన్నారు. కేసు (Case) దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read : Crime News: పేకాట కేసులో.. హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News