వరంగల్‌లో దారుణం.. యువతి హత్య.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు

పుట్టిన రోజున గుడికి వెళ్లొస్తానని చెప్పి బయటకు వెళ్లిన ఓ యువతిపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారనే ఘటన వరంగల్‌లో కలకలంరేపింది.

Last Updated : Nov 28, 2019, 02:48 PM IST
వరంగల్‌లో దారుణం.. యువతి హత్య.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు

వరంగల్: పుట్టిన రోజున గుడికి వెళ్లొస్తానని చెప్పి బుధవారం ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఓ యువతి శవమై కనిపించడం ఆమె తల్లిదండ్రులను తీవ్ర విషాదానికి గురిచేసింది. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి, హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తంచేశారు. గుడికి వెళ్లి అలాగే స్నేహితులను కలిసొస్తానని చెప్పి వెళ్లిన తమ కూతురు హంటర్ రోడ్డులో శవమై కనిపించడం చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆధారాలు బయటికి రాకుండా చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. 

Read also : మార్ఫింగ్‌ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసి లైంగిక వేధింపులు.. బీటెక్ స్టూడెంట్ అరెస్ట్!

పోలీసుల దర్యాప్తులో పలు కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో కొన్ని ఆధారాలు లభ్యం కాగా.. హంటర్ రోడ్డుకు దారితీసే మార్గాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు.. నిందితులకు సంబంధించిన ఇంకొన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. ప్రస్తుతం వాటి ఆధారంగానే పోలీసులు దర్యాప్తులో ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

Trending News