Ghmc Mayor Elections process: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కపార్టీకి మెజార్టీ రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ అధికారంలో వస్తుందనేది పక్కనబెడితే..అసలు మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకోవల్సిన అంశం.
గ్రేటర్ హైదరాబాద్ ( Greater Hyderabad ) పరిధిలో 150 డివిజన్ కార్పొరేటర్లున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ లను కార్పొరేటర్లు కలిసి ఎన్నుకుంటారు. కార్పొరేటర్లతో పాటు ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు సైతం ఈ ఎన్నికలో పాలుపంచుకుంటారు.
గ్రేటర్ పరిధిలో మొత్తం 45 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ( 45 Ex Officio members ) ఉన్నారు. అంటే మొత్తం 195 కలిసి మేయర్, డిప్యూటీల్ని ఎన్నుకుంటారు. పరోక్ష ఎన్నికలు కావడంతో ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో జరిగే ఓ ప్రత్యేక సమావేశంలో మేయర్, డిప్యూటీల ఎన్నిక జరుగుతుంది. మేయర్ ను ఎన్నుకునేందుకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు ముందుగా నోటీసు లేదా ఆహ్వానాన్ని మూడ్రోజుల ముందు పంపిస్తారు. Also read: Bharat Bandh: రైతుల దేశవ్యాప్త బంద్‌కు కేసీఆర్ మద్దతు
ముందుగా కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం ఉంటుంది. సభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాతే మేయర్ ఎన్నిక ( Mayor Election ) ఉంటుంది. ప్రమాణ పత్రాలు జీహెచ్ఎంసీ ( GHMC ) లో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. మేయర్ అభ్యర్ధిత్వానికి ఒకరు ప్రతిపాదిస్తే..మరొకరు బలపరచాల్సి ఉంటుంది. చెయ్యి పైకెత్తి చెప్పడం ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఎవరికి అనుకూలంగా ఎంత మంది చేయి ఎత్తారో లెక్కిస్తారు.
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియోలతో సహా మొత్తం ఓటర్లలో 50 శాతం తప్పకుండా హాజరవ్వాలి. అప్పుడే కోరంగా పరిగణిస్తారు. కోరం లేకపోతే గంటసేపు నిరీక్షిస్తారు. అప్పటికీ కోరం లేకపోతే తరువాతి రోజుకు వాయిదా వేస్తారు. మరునాడు కోరం లేకపోతే..ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది.
జీహెచ్ఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ( Ghmc Ex officio members )పేర్లు నమోదు చేసుకున్న ఎంపీలు గానీ, ఎమ్మెల్యేలు గానీ, ఎమ్మెల్సీలకు గానీ ఓటు హక్కు ఉంటుంది. అయితే వీరు ఏ ఇతర పురపాలకసంఘంలో కూడా ఓటు వేసి ఉండకూడదు. ఆ విధంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేస్తాయి. ఎన్నికకు 24 గంటల ముందు పార్టీ అధ్యక్షుడు లేదా పార్టీ నియమించిన వ్యక్తి విప్ జారీ చేయవచ్చు. విప్ ఉల్లంఘిస్తే..సదరు సభ్యులపై చర్యలుంటాయి. ఆ చర్యల్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే...తుదితీర్పు వచ్చేవరకూ సభ్యులుగానే కొనసాగుతారు. Also read: GHMC Elections 2020: మేయర్ పీఠం ఎవరిది..మజ్లిస్ మద్దతు ఉండదా