GHMC Elections 2020: స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం..రీ పోలింగ్ రేపే

GHMC Elections 2020: ప్రతిష్టాత్మక గ్రేటర్ హైదరాబాద్ పోరు ముగిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. ఒకే ఒక చోట రీ పోలింగ్ నిర్వహిస్తుండగా...4వ తేదీ కౌంటింగ్ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Last Updated : Dec 2, 2020, 08:05 AM IST
  • ఓల్ మలక్ పేట మినహా మిగిలిన 149 డివిజన్లలో ప్రశాంతంగా పోలింగ్
  • 45.71 శాతం పోలింగ్ నమోదు..2016 కంటే స్వల్పంగా పెరిగిన పోలింగ్
  • డిసెంబర్ 3న ఓల్డ్ మలక్ పేట రీ పోలింగ్, డిసెంబర్ 4న కౌంటింగ్
GHMC Elections 2020: స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం..రీ పోలింగ్ రేపే

GHMC Elections 2020: ప్రతిష్టాత్మక గ్రేటర్ హైదరాబాద్ పోరు ముగిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. ఒకే ఒక చోట రీ పోలింగ్ నిర్వహిస్తుండగా...4వ తేదీ కౌంటింగ్ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ( Greater Hyderbabd Elections ) అందర్నీ పోలింగ్ నిరాశపర్చిన సంగతి తెలిసిందే. గ్రేటర్ ఓటర్ పోలింగ్ బూత్ కు రావడంలో ఆసక్తి చూపించలేదు. 2016  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో( Ghmc elections ) జరిగిన పోలింగ్ కంటే ఈసారి తక్కువ నమోదైంది. నిన్న జరిగిన ఎన్నికల్లో 45.71 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమీషన్ రాత్రి ప్రకటించింది. కొన్ని డివిజన్లలో పోలింగ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 25 శాతం పోలింగ్ కూడా నమోదవని ప్రాంతాలున్నాయి.

జీహెచ్ఎంసీ ( Ghmc ) పరిధిలోని 150 డివిజన్లకు పోలింగ్ జరగాల్సి ఉండగా..సాంకేతిక కారణాల దృష్ట్యా జరిగిన తప్పిదంతో ఓ చోట పోలింగ్ ( Polling ) నిలిపేశారు. 149 డివిజన్లలో మాత్రం ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. ప్రారంభం నుంచి పోలింగ్ మందకొడిగానే సాగింది. 1122 మంది అభ్యర్ధుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో ( Ballot boxex ) నిక్షిప్తమైంది. భారీ పోలీసు భద్రత మధ్య బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించారు. 

ఓల్డ్ మలక్ పేటలో రీ పోలింగ్

ఈ ప్రాంతంలో సీపీఐ అభ్యర్ధి గుర్తు కంకి కొడవలికి బదులు..బ్యాలెట్ పేపర్ పై సీపీఎం పార్టీ గుర్తైన సుత్తి కొడవలి, నక్షత్రం గుర్తు ముద్రించారు. దీనిపై సీపీఐ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయగా..ఈ డివిజన్ లో పోలింగ్ నిలిపివేసి..డిసెంబర్ 3వ తేదీన రీ పోలింగ్ ( Re polling ) నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. ఈసారి పోలింగ్ కు మాత్రం మధ్యవేలుకు సిరా వేయాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. ఈ ఒక్క సంఘటన మినగా మరెక్కడా ఎటువంటి సంఘటనలు జరగలేదు. పోలింగ్ ప్రశాంతంగా సాగింది.

మరోవైపు డిసెంబర్ 4 న జీహెచ్ఎంసీ ఎన్నికల  కౌంటింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్ ఎన్నిక కావడంతో ఫలితాలు కాస్త ఆలస్యమవుతాయి. ఎప్పటిలానే మధ్యాహ్నం 12 గంటల వరకూ ఫలితాలు వచ్చే పరిస్థితులు లేవు. పూర్తి ఫలితాలు వెలువడేసరికి రాత్రి అయ్యే అవకాశాలున్నాయి.

మరోవైపు జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ఇంకా ముగియలేదు. ఫిబ్రవరి 10 వరకూ గడువుంది. అంటే ఫిబ్రవరి 10 తరువాతే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలనేవి జరుగుతాయి. ఈలోగా ప్రభుత్వం సవరణ తీసుకొస్తే ముందే..మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. 

సార్వత్రిక ఎన్నికల తరహాలో జరిగిన పార్టీల ప్రచారం, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలేవీ ఓటరుని ఆకట్టుకోలేకపోయాయి. అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమోననే భయంతోనే ఓటేసేందుకు రాలేదని తెలుస్తోంది. మరోవైపు మూడ్రోజుల సెలవులు కూడా పోలింగ్ శాతం తగ్గడానికి కారణమైంది. Also read: GHMC Elections 2020: భారీగా తగ్గిన పోలింగ్ ఎవరికి లాభం..ఎవరికి నష్టం..ఓ విశ్లేషణ

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x