GHMC Election Final Results - Asaduddin Owaisi comments on trs performance: హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు పట్టున్న స్థానాలన్నింటిని కైవసం చేసుకోని మూడో స్థానంలో నిలించింది ఎంఐఎం పార్టీ. 2016 ఎన్నికల్లో మాదిరిగానే ఎంఐఎం (MIM) 44 డివిజన్లల్లో విజయం సాధించింది. అయితే ఈ ఫలితాల అనంతరం ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాము 44 స్థానాల్లో గెలుపొందామని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. అయితే తమ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో తాను స్వయంగా మాట్లాడానని.. అందరూ రేపటి నుంచే పని చేసుకుంటూ వెళ్లాలని సూచించినట్లు ఆయన తెలిపారు. బీజేపీ (BJP) తో ప్రజాస్వామిక పద్దతిలో తమ పోరాటం కొనసాగుతుందని అసదుద్దీన్ స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఆ పార్టీని విస్తరించకుండా అడ్డుకోగలరన్న నమ్మకం తమకు ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు. Also Read: GHMC Election Results: ఎవరికీ దక్కని మెజారిటీ.. బలమైన పార్టీగా బీజేపీ
ఇదిలాఉంటే.. అధికార టీఆర్ఎస్ ( TRS ) పార్టీ ఈ ఎన్నికల్లో 55 సీట్లకే పరిమితం కావడంపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. టీఆర్ఎస్ ఒక బలమైన రాజకీయ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ విఫలం కావడంపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( CM KCR ) తప్పకుండా సమీక్ష చేసుకుంటారని భావిస్తున్నట్లు ఓవైసీ తెలిపారు. తెలంగాణ ప్రాంతీయతకు టీఆర్ఎస్ ప్రతినిధి అంటూ అసదుద్దీన్ ఓవైసీ సమాధానమిచ్చారు. Also read: GHMC Elections Results 2020: మేయర్ స్థానంపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..
TRS in Telangana is a formidable political party. It represents the regional sentiment of Telangana. I am sure K.Chandrashekar Rao will review the party's performance in these elections: AIMIM President Asaduddin Owaisi in Hyderabad pic.twitter.com/EVEkoEVEWf
— ANI (@ANI) December 4, 2020
అయితే 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాలను కైవసం చేసుకోగా.. ఈ సారి 55 స్థానాలకే పరిమితమైంది. అయితే బీజేపీకి (BJP) గతంలో 4 సీట్లల్లోనే గెలవగా.. ఈ సారి 48 డివిజన్లలో కాషాయ జెండాను ఎగుర వేసి రెండో స్థానంలో బలమైన పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ (Congress) మాత్రం కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. Also read : GHMC Election results 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై బీజేపి స్పందన..ః