Amarapali Serious on hydra ranganath: ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసిన హైడ్రా పేరు మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా చెరువుల పరిధిలో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల్ని హైడ్రా కూల్చివేస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు అదనపు పవర్స్ కూడా వచ్చేలా చేశారు.
హైడ్రా కు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్, సిబ్బందిని సైతంకేటాయించారు. అంతే కాకుండా.. హైడ్రా కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చారు. దీనికి గవర్నర్ సైతం ఆమోదం తెలిపారు. దీంతో ప్రస్తుతం హైడ్రా కు.. జీహెచ్ఎంసీ పరిధిలో బల్దియా కమిషనర్, కలెక్టర్ కు ఉన్న అన్నిరకాల అధికారులు కూడా హైడ్రా కూడా వర్తిస్తాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రా ప్రజల్లోనే కాకుండా.. రాజకీయంగా కూడా రచ్చగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హైడ్రాపేరు చెప్తేనే.. ఒంటికాలి మీదలేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ మాత్రం.. మూసీ నదీ సుందరీకరణపై వెనక్కు తగ్గేదిలేదని తన స్టైల్ లో ముందుకు వెళ్తున్నారు. గతంలో పలు మార్లు హైకోర్టు సైతం.. హైడ్రాచట్ట బద్దతపై పలు సందర్భాలలో రేవంత్ సర్కారుకు ప్రశ్నలు సంధించింది.
దీంతో తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో రేవంత్ కు కోర్టుల నుంచి మాత్రం సమస్యలు ఉండదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హైడ్రా రాజకీయ నాయకుల మధ్యనే కాకుండా.. అధికారుల మధ్య కూడా చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనల్ ఆమ్రాపాలీ కాట, హైడ్రాపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలు..
హైడ్రా ఏర్పడినప్పుడు.. తొలుత జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్ విభాగంలోని కొంత మంది సిబ్బందిని హైడ్రాకు కేటాయించారు. అప్పటి నుంచి వాళ్లు హైడ్రాపరిధిలో పనిచేస్తు.. శాలరీలు మాత్రం జీహెచ్ఎంసీ నుంచి పోందుతున్నారు. దీంతో ఇటీవల పలుసార్లు కౌన్సిల్ సమావేశంలో.. హైడ్రాకు కేటాయించిన బల్దియా సిబ్బంది విషయంలో అధికారులు.. ఆమ్రాపాలికి విజిలెన్స్ అధికారులు లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలు చెప్పారు. దీంతో ఆమ్రాపాలీ వెంటనే.. తమ సిబ్బందిని రిలీవ్ చేయాంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు గతంలో లేఖలు సైతం రాశారంట.
కానీ... ఆయన మాత్రం దీనిపై ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీంతో దీనిపై సీరియస్ అయిన ఆమ్రాపాలీ.. బల్దియా ఉద్యోగులకు డెడ్ లైన్ విధించి.. బల్దియా విధుల్లోకి రాకుంటే.. శాలరీలు సైతం నిలిపివేయాలని ఆర్థిక శాఖకు లేఖను సైతంరాసినట్లు ప్రచారం జరిగింది. అయిన కూడా.. ఇప్పటి వరకు విజిలెన్స్ సిబ్బంది హైడ్రా పరిధిలోనే పనిచేస్తున్నారంట. దీంతో ఆమ్రాపాలీ కాట.. దీన్ని సీరియస్ గా పరిగణించారని తెలుస్తోంది.
అంతేకాకుండా.. హైదరాబాద్ పరిధిలో.. సహజంగా ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీకి రావాల్సి ఉండగా.. ఇప్పుడు హైడ్రా వద్దకు వెళ్తుండడంతో గ్రేటర్ పాలకమండలి మండిపడుతున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీకి.. ప్రాధాన్యత తగ్గిపోతున్నదని, సిటీలో తమ పరిధిలో ఎక్కడికి వెళ్లినా హైడ్రా మాటే తప్ప జీహెచ్‌ఎంసీ మాటే లేదని కార్పొరేటర్లు, నేతలు చర్చించుకుంటున్నారంట.
హైడ్రా ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీకి!
మరోవైపు హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులు చూడాలని .. కమిషనర్ జీహెచ్ఎంసీకి లేఖలు రాస్తున్నారంట. తమ పనులకే సమయం చాలడం లేదంటే మళ్లీ ఈ హైడ్రా ఫిర్యాదుల గోల ఏమిటని గ్రేటర్ అధికారులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారంట.. దీంతో ప్రస్తుతం కొంతమంది సిబ్బంది కమిషనల్ ఆమ్రాపాలీని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారంట. హైడ్రా సమస్యల వెంటపడితే జీహెచ్‌ఎంసీ పనులన్నీ కుంటుపడుతాయని, ప్రజారోగ్యం, ప్రజాపాలన, ఇతర అన్నిరకాల పనులు అటకెక్కుతుందని చెప్పారు.
మొదట్లో.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అనే విభాగం జీహెచ్‌ఎంసీలో ఒక భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు కొత్త ఆర్డినెన్స్ తెవడం వల్ల.. మొత్తం గ్రేటర్‌పైనే హైడ్రా పెత్తనం చెలాయించాలనుకోవడంపై కమిషనర్‌తో పాటు ఉద్యోగులంతా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కమిషనర్ రంగనాథ్, ఆమ్రపాలీ కాటల మధ్య వార్ పీక్స్ కు చేరిందని కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి