Gang Rape Case Update: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ మైనక్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో కొత్త అంశాలు బయటికి వస్తున్నాయి. పబ్ లో బాలికను ఎలా ట్రాప్ చేసింది.. బెంజ్ కారులో ఏం జరిగింది.. ఇన్నోవా కారులో జరిగిన గ్యాంగ్ రేప్ కు సంబంధించి నిందితుల నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. మొదట కొంత సతాయించిన నిందితులు... పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మినిట్ టు మినిట్ ఏం జరిగిందో వివరించారని సమాచారం. ఈ కేసులో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న బంజారాహిల్స్ ఏసీబీ సుదర్శన్ విచారణలో నిందితులంతా దాదాపుగా ఓకే సమాధానం చెప్పారని తెలుస్తోంది.
మైనర్లు చెప్పిన వివరాల ప్రకారం అమ్నేషియా పబ్ నుంచి బెంజ్ కారులో మైనర్ బాలికను తీసుకెళ్లారు. కాన్సూ బేకరీకి వెళ్లాక బాలికను ఇన్నోవా కారులోకి తరలించారు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కారును నిలిపారు. కారులోనే మైనర్ బాలికపై వరుసగా అత్యాచారం చేశారు. బాలిక మెడపై ఉన్న గాయాలపైనా నిందితులు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. మెడపై టాటూల్లా ఉంటాయనే కొరికామని నిందితులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. రేప్ సమయంలో బాధితురాలు ప్రతిఘటించడంతో గాయాలయ్యాయని వెల్లడించారు. ఈకేసులో ఏకైక మేజర్ గా ఉన్న ఏ1 నిందితుడు సాదుద్దీన్ రెచ్చగొట్టడం వల్లే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డామని మైనర్లు చెప్పారని తెలుస్తోంది. అయితే ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాత్రం బెంజ్ కారులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకే మొదటగా బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పినట్లు సమాచారం.
మైనర్లను దాదాపు గంట సేపు ప్రశ్నించిన పోలీసులు.. జువెనైల్ హోంకు తరలించారు. మరో నాలుగు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. గ్యాంగ్ రేపు కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే కొడుకుని పోలీసులు ప్రత్యేకంగా ప్రశ్నించారు. బెంజ్ కారులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లారు.. ఆ సమయంలో ఏం జరిగింది.. మధ్యలో సీట్లు ఎందుకు మారారు.. కాన్సూ బేకరీలో ఏం చేశారు.. ఇన్నోవా కారులో ఎక్కిన తర్వాత మధ్యలో ఎందుకు దిగిపోయారని ప్రశ్నించారు. మరోవైపు గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని తెలుస్తోంది. బెంజ్ కారులో మైనర్ బాలికతో కలిసి నిందుతులు ఉన్న విజువల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇద్దరిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారని చెబుతున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు నిర్వహించే టీఐపీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. కోర్టు అనుమతి ఇస్తే నిందితులను బాలికను తీసుకెళ్లి నిందితులను గుర్తించే ప్రక్రియ నిర్వహించనున్నారు.
Read also: CM KCR: కేసీఆర్ ఆ పని చేస్తే రేవంత్ రెడ్డికి గండమే..? తెలంగాణలో ఏం జరగబోతోంది..
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి