Fuel Prices In Hyderabad: హైదరాబాద్: వాహనదారులకు షాకింగ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ మరోసారి ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి పెట్రోల్ ధర లీటర్‌కి 91 పైసలు పెరిగింది. అలాగే లీటర్ డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి రానున్నాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు మధ్య తరగతి వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గత ఐదు నెలలుగా స్థిరంగా ఉంటూ వచ్చిన ఇంధనం ధరలు గత రెండు రోజుల నుంచి పెరుగుదల బాటపట్టాయి. ధరల పెంపు అనంతరం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కి రూ.109.99 చొప్పున ఉండనుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.35 మార్క్‌ని తాకింది.
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత కూడా ఓ పన్నెండు రోజుల పాటు ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వాహనదారులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే పెట్రో ధరల బాంబు మరోసారి పేలింది. రోజుకు దాదాపు రూపాయి చొప్పున పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.
సాధారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకునే పరిణామాలు ఇంధనం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. అలాంటిది ఈసారి మార్కెట్ పరిస్థితులకు తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine War Updates) చమురు సరఫరాకు అడ్డంకిగా మారి కొరతకు దారితీసింది. ఇప్పటికే పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగి ఊహించని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం పరిశీలిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కి మరో 10 రూపాయలు నుంచి 20 రూపాయల మేర పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రవాణా ఛార్జీలు కూడా పెరిగి నిత్యావసరాల ధరలు సైతం అమాంతం పెరిగి పేదోడిపై మరింత ఆర్థిక భారం పడే ప్రమాదం లేకపోలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Also read : Indian Railway: ఇండియన్ రైల్వే మరో రైలురాయి.. దేశవ్యాప్తంగా 6100 స్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు...
Also read : Bheemla Nayak OTT: పవన్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఒక్కరోజు ముందుగానే ఓటీటీలో రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook