Medaram Online Prasadam: నేటి నుంచి ఆన్‌లైన్‌లో మేడారం ప్రసాదం బుకింగ్ సేవలు..

Medaram Online Prasadm: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఆన్‌లైన్ ద్వారా ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన భారత దక్షిణ మహా కుంభమేళాకు మేడారం సిద్ధమవుతోంది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 14, 2024, 10:20 AM IST
Medaram Online Prasadam: నేటి నుంచి ఆన్‌లైన్‌లో మేడారం ప్రసాదం బుకింగ్ సేవలు..

Medaram Online Prasadam: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఆన్‌లైన్ ద్వారా ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన భారత దక్షిణ మహా కుంభమేళాకు మేడారం సిద్ధమవుతోంది. జాతర ఘడియలు సమీపిస్తుండడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటుండడంతో మేడారం ప్రాంతం కిటకిటలాడుతోంది. ఈనెల 21వ తేదీ నుంచి 28 వరకు జాతర జరగనుండగా ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి.

మీ సేవ ద్వారా జాతరలో బరువుకు తూగే బెల్లం ధరను మీ సేవ ద్వారా చెల్లించే అవకాశం  తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఈ సేవలను సచివాలయంలో తన కార్యాలయంలో ప్రారంభించారు.బరువు ప్రకారం డబ్బులు చెల్లించి అమ్మవారి గద్దెల వద్ద నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సౌకర్యం ఉంది. వివిధ కారణాలతో సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోలేని భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి:  ముస్లిం దేశమైన యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా?

దేవాదాయ శాఖ సంవత్సరం పొడవునా బంగారం సమర్పణ సేవలను అందిస్తుంది. బంగారం సమర్పణతో పాటు, అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు కూడా పోస్టల్ డిపార్ట్ మెంట్, టి యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా  డబ్బులు చెల్లించినట్లైతే, పోస్టల్ డిపార్ట్ మెంట్ కొరియర్ ద్వారా వారికి ప్రసాదాన్ని అందిస్తుంది. మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్‌లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికే ప్రసాదం వస్తుంది. ఆర్టీసీ కార్గొ కౌంటర్లు ఈ సేవలను అందిస్తున్నాయి.

ఇదీ చదవండి: రేపే వసంతపంచమి.. ఈ రంగు దుస్తులు ధరించి పూజిస్తే లక్ష్మీకటాక్షమే..!

ఈరోజు అంటే ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు ఆర్టీసీ యాప్ లో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. TSRTC కాల్ సెంటర్ నంబర్, 040-30102829, 040-68153333. TSRTC యాప్ లో కూడా ఈ ప్రసాదానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. https://www.tsrtc.telangana.gov.in. అధికారిక వెబ్‌సైట్లో కూడా ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఈనేపథ్యంలో మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పిన సంగతి తెలిసిందే.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News