Etela Rajender Press Meet: ఈటెల సంచలన వ్యాఖ్యలు.. TRS నేతలు టచ్‌లోనే ఉన్నారు.. KCR పై పోటీకి సిద్ధం

Etela Rajender press meet live updates: హుజూరాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరో సంచలన ప్రకటన చేశారు. బీజేపి అధిష్టానం ఆదేశిస్తే తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రేశేఖర్ రావుపై పోటీ చేయడానికైనా సిద్ధమేనని ఈటల రాజేందర్ ప్రకటించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 08:14 PM IST
  • టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ఈటల రాజేందర్
  • వచ్చే ఎన్నికల్లో పోటీపై ఈటల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
  • పార్టీ ఆదేశిస్తే.. సీఎం కేసీఆర్‌పైనే నా పోటీ అంటున్న Etela Rajender
Etela Rajender Press Meet: ఈటెల సంచలన వ్యాఖ్యలు.. TRS నేతలు టచ్‌లోనే ఉన్నారు.. KCR పై పోటీకి సిద్ధం

Etela Rajender press meet live updates: హుజూరాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరో సంచలన ప్రకటన చేశారు. బీజేపి అధిష్టానం ఆదేశిస్తే తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రేశేఖర్ రావుపై పోటీ చేయడానికైనా సిద్ధమేనని ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 'మీట్‌ ద ప్రెస్‌' కార్యక్రమంలో (Eetala Rajender's meet the press) పాత్రికేయులతో మాట్లాడుతూ ఈటల రాజేందర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

వచ్చే ఎన్నికల్లోనూ హుజూరాబాద్ (Huzurabad constituency) నుంచే పోటీ చేస్తానని చెప్పిన ఈటల రాజేందర్.. ఒకవేళ పార్టీ అధిష్టానం చెబితే కేసీఆర్‌పై పోటీకైనా తాను సిద్ధమే అని తెలిపారు. బీజేపీలో విభేదాలు ఉన్నాయనే ప్రచారాన్ని తిప్పికొడుతూ.. పార్టీలో అందరం కలిసి పనిచేస్తున్నామని, అలాగే తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో అయిష్టంగానే కొనసాగుతున్నారనే ప్రచారంపైనా ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీలో సంతృప్తిగానే ఉన్నానని ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. 

Also read : Omicron Cases In Telangana: తెలంగాణలో మూడు ఒమిక్రాన్‌ కేసులు.. ఏడేళ్ల చిన్నారికి పాజిటివ్‌

టీఆర్ఎస్‌కి షాకింగ్ స్టేట్‌మెంట్
టీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదని, ఇంకా పార్టీలో కొనసాగితే కష్టమే అని భావించే వాళ్లు చాలా మందే ఉన్నారని అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని తరచుగా చెబుతూ వస్తున్న ఈటల రాజేందర్.. మరోసారి ఈ ప్రకటనతో టీఆర్ఎస్ పార్టీని అభద్రతా భావానికి గురిచేసే ప్రయత్నం చేశారు. ఇకపై టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు (TRS leaders to join BJP) షురూ అవుతాయనే సంకేతాన్నిచ్చారు.

మంత్రివర్గ భేటీకి ముందే నిర్ణయాలు
టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన (TRS govt) ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలతోనే నడుస్తోందన్న ఈటల రాజేందర్.. తాను మంత్రిగా ఉన్నప్పటి విషయాలను అందుకు ఉదాహరణగా గుర్తుచేసుకున్నారు. మంత్రివర్గ భేటీ ఉందని పిలిచే వారని.. కానీ మంత్రివర్గం భేటీలో (Telangana cabinet meeting) చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలను అంతకంటే ముందే తీసుకునే వారని ఆవేదన వ్యక్తంచేశారు.

Also read : Bandi Sanjay : 'జీవో 317 ముఖ్యమంత్రి..​ తుగ్లక్ పాలనకు నిదర్శనం': బండి సంజయ్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News