Ramojirao funeral completed at ramoji filmcity: అక్షర యోధుడు, మీడియా మోఘల్ రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. కుమారుడు కిరణ్ రామోజీ చితికి నిప్పుపెట్టాడు. ఈ కార్యక్రమంలో ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రామోజీ రావు పాడే మోసి, భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఇప్పటికే రేవంత్ సర్కారు కూడా అధికార లాంఛనాలతో రామోజీ రావు అంత్యక్రియలను నిర్వహించాలని సీఎస్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఒక మీడియా అధినేతకు ఇలా ప్రభుత్వ లాంఛనాలతో, అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆయనకు దక్కిన గౌరవంగా చెప్పుకుంటున్నారు.
Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
పచ్చళ్ల వ్యాపారం నుంచి మొదలు పెట్టి ఏ రంగంలో అడుగు పెట్టిన ఆయన తనదైన బ్రాండ్ ను క్రియేట్ చేశారు. రామోజీ రావుని రాజకీయాల్లో కింగ్ మేకర్ అని చెప్తుండేవారు. ఉషోదయ, మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈటీవీ, వసుంధర, ఈనాడు టెలివిజన్, ఉషాకిరణ్,మయూరీ డిస్ట్రీబ్యూటర్స్,కళాంజలి, డాల్ఫిన్స్ హోటల్స్,ప్రియా ఫుడ్స్, అనేక భాషల్లో ఛానెళ్లను నడిపించారు. రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సాధించారు. వీటితో లక్షల మందికి ఉపాధిని కలిగేలా చేశారు.
ముఖ్యంగా మీడియా రంగంలో రామోజీ రావు.. ఈనాడు జర్నలిజం స్కూల్ ను ఏర్పాటు చేసి వేలాది మంది ఉత్తమ పాత్రికేయులను తీర్చి దిద్దారు. ఈ నేపథ్యంలో రామోజీ రావు మరణం పట్ల అటు సినీరంగ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్, నరేష్, మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి ముఖ్యులు తమ సంతాపం తెలిపారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మోదీ, తెలంగాణ సీఎం రేవంత్, చంద్రబాబు, బాలయ్య, పవన్ కళ్యాణ్, వంటి రాజకీయ నాయకులు రామోజీరావుకు తమ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీని కడసారి చూసేందుకు.. రామోజీ ఫిల్మ్ సిటీకి వేలాదిగా ప్రముఖులు, వీఐపీలు, అభిమానులు క్యూలు కట్టారు. ఇదిలా ఉండగా.. ఏపీ నుంచి కూడా ప్రభుత్వం తరపున ప్రత్యేక అధికారులు అంతిమ సంస్కారాలలో పాల్గొన్నారు.
తెలంగాణ సర్కారు నుంచి.. అంత్యక్రియల్లో తెలంగాణ మంత్రులు, తమ్ముల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, వి. హనుమంతరావు, వద్దిరాజు రవిచంద్ర, ఏపీ నుంచి నారా లోకేశ్, సుజనా చౌదరి, కాల్వ శ్రీనివాసులు, తదితర రాజకీయా నేతలు పాల్గొన్నారు. రామోజీ రావుకు అంతిమ సంస్కారాలలో.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
రామోజీ ఫిల్మ్‌సిటీ ఆవరణలోని.. బతికుండగాననే ఆయన నిర్మించుకున్న స్మృతి వనంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రామోజీ కుమారుడు కిరణ్ రామోజీ చితికి నిప్పుపెట్టారు. ఏపీలో రెండు రోజుల పాటు రామోజీ రావు మరణానికి నివాళిగా రెండు రోజుల పాటు సంతాపదినాలుగా పాటిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter