EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..

EPF New Rule: అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్‌ అవుతుంది. రిటైర్‌మెంట్‌ తర్వాత ఈ డబ్బులు పొందవచ్చు. అయితే, మీకు మరో బంపర్‌ ఛాన్స్‌ అందిస్తోంది ఈపీఎఫ్‌ఓ. ఏకంగా 75 శాతం మీ డబ్బులను విత్‌డ్రా చేసుకునే అవకాశం అందిస్తోంది. 
 

1 /6

ఈపీఎఫ్‌ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. కొత్త రూల్‌ ప్రకారం మీ పీఎఫ్‌ ఖాతా నుంచి 75 శాతం వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే, కొన్ని క్లిష్ట సమయంలో జాబ్‌ కోల్పోవాల్సి వస్తే ఈ రూల్‌ మీకు వర్తిస్తుంది. ఈ సమయంలో మీ పీఎఫ్‌ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవచ్చు.  

2 /6

ఒకవేళ మీరు రెండు నెలలపాటు జాబ్‌ లేకుండా ఉంటే మీరు ఈ డబ్బులను పొందచ్చు. ఒకవేళ కొత్త జాబ్‌ వస్తే ఆ ఖాతాకు మిగిలిన డబ్బులను బదిలీ చేస్తారు. ఈ కొత్త రూల్‌ జాబ్‌ కోల్పోయిన ఉద్యోగులకు బాసటగా నిలుస్తోంది. ఈ విధానం ద్వారా విత్‌డ్రా చేసుకోవడం కూడా ఎంతో సులువు.  

3 /6

అయితే, ఈ కొత్త నిబంధన ప్రకారం రిటైర్మెంట్‌కు ఒక నెల ముందు కూడా 90 శాతం డబ్బులు ఉద్యోగి విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఉద్యోగి కనీస వయస్సు 54 ఏళ్లు కలిగి ఉండాలి.  

4 /6

ఈపీఎఫ్‌ఓ ద్వారా ప్రతినెలా జీతంలో నుంచి డబ్బులు జమా అవుతాయి. పెళ్లిళ్లు, అనారోగ్యం, ఇంటి నిర్మాణం సమయంలో కూడా ఈపీఎఫ్‌ఓ ద్వారా డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు. వీటి నిబంధనల ఆధారంగా డబ్బలు విత్‌డ్రా చేసుకోవచ్చు.  

5 /6

ఈపీఎఫ్ ఖాతాదారులు 'ఉమాంగ్‌' యాప్‌, ఈపీఎఫ్‌ పోర్టల్‌ ద్వారా డబ్బు విత్‌ డ్రా చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన కొన్ని రోజుల్లో నేరుగా డబ్బు మీ బ్యాంకు ఖాతాల్లో జమా అవుతాయి. మీ అప్లికేషన్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకునే సదుపాయం కూడా ఈపీఎఫ్‌ పోర్టల్‌, లేదా యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.  

6 /6

ఐదేళ్లు ఈపీఎఫ్ లో కంట్రిబ్యూట్‌ చేసిన ఉద్యోగికి ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ కూడా పొందుతారు.రూ.50 వేలలోపు డబ్బు విత్‌డ్రా చేసుకుంటే టీడీఎస్‌ కట్‌ అవ్వదు. ఆపైనా 10 శాతం ట్యాక్స్‌ ప్యాన్‌ కార్డు సబ్మిట్‌ చేస్తే, ప్యాన్‌ కార్డు లేకుండా 30 శాతం ట్యాక్స్‌ కట్‌ అవుతుంది.