Kavitha Bail: ఎమ్మెల్సీ కవితపై ఈడీ సంచలన వ్యాఖ్యలు.. ఇక జైలు బయటకు రానట్టే?

ED Sensational Allegations On K Kavitha: అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరింత చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. బెయిల్‌ కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి.. ఇకపై ఆమె జైలుకే పరిమితం కానున్నారని సమాచారం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 4, 2024, 09:23 PM IST
Kavitha Bail: ఎమ్మెల్సీ కవితపై ఈడీ సంచలన వ్యాఖ్యలు.. ఇక జైలు బయటకు రానట్టే?

Kavitha Bail: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి ప్రస్తుతం తిహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరిన్ని కష్టాలు వచ్చిపడినట్టు కనిపిస్తున్నాయి. జైల్లో ఉన్న ఆమె బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తుండగా అవన్నీ వృథా అవుతున్నట్టు కనిపిస్తోంది. బెయిల్‌ కోసం చేసిన విజ్ఞప్తిపై జరిగిన చర్చల్లో కవితపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కవితనే అని ఆరోపించారు.

Also Read: Kavitha Jail Life: జైల్లో కవిత విలాసవంత జీవనం.. బూట్లు, పెన్నులు, పేపర్లు, జపమాలతో బిజీ

ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో గురువారం కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై రీజాయిన్డెర్లు ఫైర్ చేశారు కవిత తరఫు న్యాయవాదులు. కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, మధ్యంతర బెయిల్‌పై ఒక పిటిషన్‌పై కవిత తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. బెయిల్ పిటిషన్‌ పై వాదనల సందర్భంగా ఈడీ బలంగా వాదించింది. ఈ క్రమంలోనే కవితపై తీవ్ర ఆరోపణలు చేసింది.

Also Read: Gangula Kamalakar: బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌.. కాంగ్రెస్‌లోకి గంగుల కమలాకర్‌.. ఎంపీగా ఛాన్స్‌?

 

అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. 'అసలు మద్యం కుంభకోణం ప్లాన్ చేసిందే కవిత' అని ఈడీ ఆరోపించింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది.

ఈ సందర్భంగా విచారణ సమయంలో జరిగిన విషయాలను ఈడీ న్యాయస్థానానికి వివరించింది. మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవేనని కోర్టుకు నివేదించింది. విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చిన తరువాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను ఈడీ జడ్జి ముందుంచింది. కవిత తరఫున న్యాయవాది, ఈడీ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News