Diwali Celebrations: చీకట్లు నింపిన దీపావళి.. టపాసులు పేలి బాలుడు మృతి.. సరోజిని ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

Diwali Celebrations: వెలుగుల పండుగ కొందరి జీవితాల్లో చీకట్లు నింపింది. బాణాసంచా కాల్చుతూ కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఎక్కువ మంది కళ్ల ప్రమాదాలకు గురయ్యారు. క్రాకర్స్ కాల్చుతూ ప్రమాదాలకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.

Written by - Srisailam | Last Updated : Oct 25, 2022, 09:28 AM IST
  • కొందరికి చీకట్లు నింపిన దీపావళి
  • క్రాకర్స్ కాల్చుతుండగా ప్రమాదాలు
  • సరోజిని ఆస్పత్రిలో చేరిన బాధితులు
Diwali Celebrations: చీకట్లు నింపిన దీపావళి.. టపాసులు పేలి బాలుడు మృతి.. సరోజిని ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

Diwali Celebrations: దీపావళి వెంటే వెలుగుల పండుగ. తమ జీవితాల్లో వెలుగులు రావాలంటూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. లక్ష్మిదేవికి పూజలు చేస్తారు. సాయంత్రం ఇళ్లముందు దీపాలు వెలిగిస్తారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. వెలుగుల పండుగ ఈసారి కూడా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇంటిల్లిపాది కలిసి సంబరాలు చేసుకున్నారు. అయితే వెలుగుల పండుగ కొందరి జీవితాల్లో చీకట్లు నింపింది. బాణాసంచా కాల్చుతూ కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఎక్కువ మంది కళ్ల ప్రమాదాలకు గురయ్యారు. క్రాకర్స్ కాల్చుతూ ప్రమాదాలకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.

టపాసులు కాల్చే సమయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో  కొందరు గాయపడ్డారు. దీంతో బాధితులు కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. సోమవారం రాత్రే 10 కేసులు హాస్పిటల్ కు వచ్చాయి. మంగళవారం ఉదయానికి ఆ సంఖ్య పెరిగింది. దాదాపు 50 కేసులు నమోదు కాగా.. 12 మందిని హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కొంత మందికి ట్రీట్మెంట్ చేసి పంపించారు సరోజిని ఆస్పత్రి సిబ్బంది,

పటాకులు కాల్చుతూ గాయపడి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య భారీగా ఉందని తెలుస్తోంది. బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలకు గురయ్యారు.ప్రతి ఏటా దీపావళి రోజున ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అందుకే సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈసారి కూడా దీపావళి పండుగను పురస్కరించుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. అదనపు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంటారు. క్రాకర్స్ కాల్చుతూ గాయపడిన బాధితుల సంఖ్య మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నం సీతానగర్‌లో దీపావళి విషాదం నింపింది. బాణసంచా పేలి 11 ఏళ్ల బాలుడు దుర్మరమం చెందాడు. పటాకులు ఆరబెడుతుండగా ఒక్కసారిగా అవి పేలిపోయాయి. తర్వాత భారీ మంటలు రావడంతో బాలుడు మంటల్లో చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని వెంటనే హాస్పిటల్ కు తరలించినా ఫలితం దక్కలేదు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

Also Read : Surya Grahan 2022: ఇవాళే సూర్యగ్రహణం... ఏ రాశి వారికి శుభం, ఏ రాశివారికి అశుభం...

Also Read : PV Narasimha Rao Statue: విదేశీ గడ్డపై తొలిసారిగా భారత మాజీ ప్రధాని విగ్రహం.. వీవీ నరసింహ రావుకే దక్కిన అరుదైన గౌరవం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News