దిశ ఎన్‌కౌంటర్‌ : పోలీసులు పథకం ప్రకారం ఎన్‌కౌంటర్‌ చేశారన్న న్యాయవాదులు

Disha encounter..Telangana Cops give vague, contradictory statements: నిందితులు మరణించింది 2019, డిసెంబర్‌ 5 ఉదయం 5 గంటలలోపు అని డెత్‌ రిపోర్ట్‌ లో ఉందన్నారు. అయితే పోలీసులు మాత్రం ఉదయం 6:15 గంటల తర్వాత చనిపోయినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇక విచారణలో పాల్గొన్న పోలీసుల స్టేట్‌మెంట్స్ కూడా సరిగా లేవంటూ వివరించారు. దిశ కేసులో అన్నీ తానై నడిపించిన అప్పటి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌... సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణలో మాత్రం ఈ కేసుకు..తనకి సంబంధం లేదంటూ వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 12:41 PM IST
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో మొదలైన వాదనలు
  • ఎన్‌కౌంటర్ విషయంలో సుప్రీంకోర్టు నియమించి సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట వాదనలు వినిపించిన బాధితుల తరుఫు న్యాయవాదులు
  • ఇది బూటకపు ఎన్‌కౌంటరని పేర్కొన్న న్యాయవాదులు
  • పోలీసులు వారిని కాల్చి చంపి కట్టుకథలు చెబుతున్నారన్న న్యాయవాదులు
దిశ ఎన్‌కౌంటర్‌ : పోలీసులు పథకం ప్రకారం ఎన్‌కౌంటర్‌ చేశారన్న న్యాయవాదులు

Hyderabad Disha encounter case: Prosecutors say police encountered according to plan: దిశ (Disha) నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో తాజాగా వాదనలు మొదలయ్యాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులైన జొల్లు శివ (Jollu Shiva), జొల్లు నవీన్‌ (Jollu Naveen), చెన్నకేశవులు (Chennakesavulu), ఆరిఫ్‌లు (Arif) చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌ లో మృతి చెంది విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ విషయంలో సుప్రీంకోర్టు సిర్పుర్కర్‌ కమిషన్‌ (sirpurkar commission) నియమించింది. ఈ కమిషన్‌కు... ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ .. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మృతుల కుటుంబ సభ్యుల తరఫున న్యాయవాది కేవీ కృష్ణమాచారి, సామాజిక కార్యకర్త సజయ తదితరులు ఫిర్యాదుచేశారు. 

సిర్పుర్కర్‌ కమిషన్‌ (sirpurkar commission) ఇప్పటివరకు సంఘటనలో పాల్గొన్న పోలీసులను విచారించి వారి వాంగ్మూలం నమోదు చేసింది. మొదట 53 మంది పోలీసులు, సాక్షుల విచారణ సాగింది. తర్వాత మరికొందరు పోలీసులు, నలుగురు నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు మొదలయ్యాయి. నలుగురు మృతులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు కుటుంబసభ్యుల తరపున న్యాయవాదులు (Lawyers) ఇండిపెండెంట్‌ కౌన్సిల్‌ పీవీ కృష్ణమాచారి (PV Krishnamachari), సహాయకురాలు రజిని కమిషన్‌కు వాదనలు వినిపించారు. ఇది బూటకపు ఎన్‌కౌంటరని పేర్కొన్నారు. నలుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని కాల్చి చంపి కట్టుకథలు చెబుతున్నారన్నారని తెలిపారు. నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఆయుధాలతో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉండగా.. ఆ నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నాలేవీ చేయలేదని తెలిపారు. పోలీసులు (Police) పథకం ప్రకారం ఆ ఎన్‌కౌంటర్‌ చేశారని సిర్పుర్కర్‌ కమిషన్‌ తెలిపారు. నిందితులకు బెయిల్‌ (Bail‌) కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కస్టడీలోకి (Custody) తీసుకొని సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ (Scene Reconstruction) పేరిట ఇలా చేశారన్నారు. నలుగురిలో ముగ్గురు నిందితులు శివ, నవీన్, చెన్నకేశవులు మైనర్లని, వారిని పోలీసులు జువెనైల్‌ కోర్టుకు పంపించలేదని గుర్తు చేశారు.

Also Read : న్యూజిలాండ్ జట్టుకు మరోషాక్.. ఇండియాతో టెస్టు సిరీస్ కివీస్ బౌలర్ ఔట్

నిందితులు మరణించింది 2019, డిసెంబర్‌ 5 ఉదయం 5 గంటలలోపు అని డెత్‌ రిపోర్ట్‌ లో (Death report) ఉందన్నారు. అయితే పోలీసులు మాత్రం ఉదయం 6:15 గంటల తర్వాత చనిపోయినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇక విచారణలో పాల్గొన్న పోలీసుల స్టేట్‌మెంట్స్ కూడా సరిగా లేవంటూ వివరించారు. దిశ కేసులో అన్నీ తానై నడిపించిన అప్పటి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ (VC Sajjanar‌)... సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణలో మాత్రం ఈ కేసుకు..తనకి సంబంధం లేదంటూ వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. తర్వాత జర్నలిస్ట్‌ కె.సజయ తరఫు న్యాయవాది వసుధ నాగరాజు వాదనలు వినిపించారు. నిందితులను జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచాల్సి ఉండగా ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారన్నారని పేర్కొన్నారు. అక్కడ 15 రోజులు రిమాండ్‌ విధించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. తప్పులు సరిదిద్దుకునేందుకే పోలీసులు (Police) ఇలా చేశారని కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

Also Read : సమస్యలతో సతమతం అవుతున్నారా..? జమ్మి చెట్టు ఇంట్లో నాటితే అన్ని కష్టాలు తొలగిపోతాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News