Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత 24గంటల్లో (జనవరి 10న) ఆదివారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 224 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా ఒకరు మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ (TS Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,90,008 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,566 కి పెరిగింది.
ఇదిలాఉంటే.. నిన్న కరోనా (Coronavirus) నుంచి నిన్న 461 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,83,924 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 4,518 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా (Covid-19) రికవరీ రేటు 97.90 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతం ఉంది. Also read: Covid-19 Vaccine: నేడు సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
రాష్ట్రంలో (Telangana) నిన్న 24785 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి జనవరి 10వ తేదీ వరకు మొత్తం 72,78,021 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా.. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో 56 కేసులు నమోదయ్యాయి.
Also Read: India Covid-19: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook