Telangana Covid-19: కొత్తగా 857 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గత నాలుగైదురోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న వేయికి తక్కువగా నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.

Last Updated : Nov 9, 2020, 09:31 AM IST
 Telangana Covid-19: కొత్తగా 857 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గత నాలుగైదురోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న వేయికి తక్కువగా నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే గత 24 గంటల్లో ఆదివారం ( నవంబరు 8న) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,51,188 కి చేరగా.. మరణాల సంఖ్య 1,381 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,504 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,30,568 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 19,239 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.79 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది.  Also read: Narendra Modi: షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మార్పు: ప్రధాని మోదీ

ఇదిలావుంటే.. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా 23,806 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 8వ తేదీ వరకు మొత్తం 46,42,276 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 250 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..

telangana corona cases bulletin

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News