CM Revanth Reddy in Davos 2025: సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్ లో జరిగిన “కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్” రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు పలు ప్రశ్నలపై మాట్లాడారు.
“పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారితో వేదికను పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము సరిహద్దులతో పాటు నదులు, కృష్ణా మరియు గోదావరి నీటిని కూడా పంచుకుంటున్నాం. ఈ నదులు మహారాష్ట్ర నుండి ప్రారంభమై, తెలంగాణలోకి ప్రవేశించి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తాయి. అందువల్ల, మేం అభివృద్ధి సాధించడమే మా మొదటి ప్రాధాన్యత. హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడుతుంది. న్యూయార్క్, టోక్యో లాంటి నగరాల స్థాయికి అభివృద్ధి చెందాలనేది లక్ష్యం. తెలంగాణ పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలను కొనసాగిస్తుంది.
కంప్యూటర్స్, టెలికాం రంగాల్లో రాజీవ్ గాంధీ గారు ప్రారంభించిన సంస్కరణలు, పీవీ నరసింహరావు గారి సరళీకృత ఆర్థిక విధానాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడే మార్గాన్ని చూపించారు.
చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తీరు అసాధారణం. ఇప్పుడు, తెలంగాణ ప్రపంచ స్థాయి నగరాలతో, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీపడుతోంది. మేము దేశీయ రాష్ట్రాలతో పోటీ పడటం కన్నా చైనా ప్లస్ వన్ కంట్రీకి గమ్యస్థానంగా తెలంగాణ ఉంది. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న భారత ప్రధానమంత్రి గారి లక్ష్యసాధనలో తెలంగాణ భాగస్వామ్యమవుతుంది. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకుపోతోంది.
తెలంగాణను మూడు ప్రాంతాలుగా అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించాం. ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాలున్నాయి. రెండో భాగం ఓఆర్ఆర్ నుంచి 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే 65 శాతం తెలంగాణ నగర ప్రాంతంగా మారుతుంది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పట్టణీకరణ కీలకం. తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీ, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, మాంసం, కోళ్లు చేపల ఎగుమతి పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను.
ప్రపంచం ఎలా పురోగమిస్తుందో తెలుసుకోవడానికి దావోస్ పర్యటన ఉపయోగపడింది. అదే సమయంలో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించాలని అనుకుంటున్నాం. మా అత్యంత పెద్ద బలం హైదరాబాద్ మరియు యువత. మా ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటాయి. మాపై నమ్మకం ఉంచండి. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. కానీ అభివృద్ధి విషయంలో మా విధానాలు సుస్థిరంగా ఉంటాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.” అని వేదిక నుంచి పారిశ్రామిక వేత్తలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
Also Read: Body Parts Cooked: ఘోరాతి ఘోరం.. భార్యను హత్య చేసి కుక్కర్‌లో ఉడికించిన భర్త
Also Read: Mahakumbh Mela 2025 Yogi: కుంభమేళాలో సీఎం యోగి మంత్రుల పుణ్య స్నానాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter