KCR Sircilla Tour: తనయుడు KTR నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

KCR Sircilla Tour Schedule: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2021, 09:25 AM IST
  • తనయుడు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటన
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
  • సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్న తెలంగాణ సీఎం
KCR Sircilla Tour: తనయుడు KTR నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

KCR Sircilla Tour Schedule: తెలంగాణ సీఎం కేసీఆర్ గత నెల నుంచి జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఇటీవల ప్రారంభించిన సీఎం కేసీఆర్, వారంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో సామూహిక భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. నేటి ఉదయం రోడ్డు మార్గంలో ఆయన Telangana IT Minister KTR నియోజకవర్గం సిరిసిల్ల చేరుకోనున్నారు. మొదటగా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో నిర్మించిన 1,320 డబుల్ బెడ్ రూం ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. రూ.80 కోట్ల వ్యయంతో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారు. కొందరు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను స్వయంగా అందిస్తారు. మధ్యాహ్నం 12;30 గంటలకు అదే మండలంలోని మండెపల్లిలో నిర్మించిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించనున్నారు.

Also Read: AP vs Telangana: ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

అనంతరం సిరిసిల్ల చేరుకుని నర్సింగ్ కళాశాల భవనాన్ని సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ప్రారంభిస్తారు. రూ.36 కోట్లతో ఐదెకరాల స్థలంలో ఈ నర్సింగ్ కళాశాల నిర్మించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సర్దాపూర్‌లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. చివరగా మధ్యాహ్నం దాదాపు 2 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. 82 ఎకరాల స్థలంలో దాదాపు రూ.70 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాంప్లెక్స్ నిర్మించారు. సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారని అధికారులు తెలిపారు.

Also Read: TPCC Chief రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే Danam Nagender ఫైర్, చివరిశ్వాస వరకు కేసీఆర్‌తోనని స్పష్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News