అందుకే 'నగర బహిష్కరణ'లు: స్పష్టం చేసిన కేసీఆర్

ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద, సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌లపై నగర బహిష్కరణలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పందించారు.

Last Updated : Jul 16, 2018, 12:35 PM IST
అందుకే 'నగర బహిష్కరణ'లు: స్పష్టం చేసిన కేసీఆర్

ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద, సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌లపై నగర బహిష్కరణలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే వాళ్లను నగరం నుంచి బహిష్కరించినట్లు స్పష్టం చేశారు.

ఆదివారం కేసీఆర్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. పాలన, ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. త్వరలో లాంఛనంగా ప్రారంభించబోతున్న పలు పథకాలు, వాటి ఉద్దేశాలు, వివరాలను గవర్నర్‌కు కేసీఆర్ తెలియజేశారు. 30 సంచార జాతులను బీసీల్లో చేర్చాలన్న ప్రతిపాదనలను కూడా కేసీఆర్‌ వివరించారు. ఈ క్రమంలోనే 'నగర బహిష్కరణ' అనే అంశం చర్చకు వచ్చింది. కత్తి మహేశ్‌ వ్యాఖ్యలు, స్వామి పరిపూర్ణానంద ఆందోళనలతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకూడదని వాళ్లను నగరం నుంచి బహిష్కరించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. కాగా.. త్వరలో ప్రారంభంకానున్న హరితహారం కార్యక్రమానికి హాజరు కావాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు.

 

Trending News