Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిపై అట్రాసిటీ కేసు

జర్నలిస్టును ఫోన్‌లో దూషించిన సంగారెడ్డి (Sangareddy ) జిల్లా పటాన్‌చెరు టీఆర్ఎస్ (TRS ) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (TRS MLA Mahipal Reddy) పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.

Last Updated : Dec 10, 2020, 11:49 AM IST
Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిపై అట్రాసిటీ కేసు

Case registered against TRS MLA Mahipal Reddy: హైదరాబాద్: జర్నలిస్టును ఫోన్‌లో దూషించిన సంగారెడ్డి (Sangareddy ) జిల్లా పటాన్‌చెరు టీఆర్ఎస్ ( TRS ) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ( MLA Mahipal Reddy) పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. ఓ ప్రముఖ దినపత్రికకు చెందిన జర్నలిస్టు సంతోష్ నాయక్‌ (santhosh nayak) ను ఫోన్‌లో దూషించిన ఆడియో క్లిప్పింగ్‌ రెండురోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. దీనిలో ఎమ్మెల్యే జర్నలిస్టును అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా.. దాడి చేస్తానంటూ బెదించారు. Also read: COVID-19 vaccine: ఆ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి బ్రేక్

దీంతో జర్నలిస్టు (journalist) సంతోష్ కుమార్ పోలీసులను ( Telangana Police ) ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు (Police) ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఐపీసీ 109, 448, 504, 506 సెక్షన్ల కింద కేసు అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. Also read; Andhra Pradesh: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం: ముగ్గురు మృతి

ఈ నేపథ్యంలో పటాన్‌చెరు (Patancheru ) ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన మాటలు ఎవరినైనా బాధిస్తే చింతిస్తున్నానని.. అలా మాట్లాడటం తప్పేనని పేర్కొన్నారు. తాను ఏనాడూ జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడలేదని తెలిపారు. తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు సదరు విలేకరి ప్రతిపక్ష పార్టీ నాయకులతో చేతులు కలిపారని ఆరోపించారు. Also read: Health Benefits of Egg: ప్రతిరోజూ ‘గుడ్డు’ ఎందుకు తినాలో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News