Telangana Bhavan Vastu: అధికారం కోల్పోవడం.. పార్టీ నాయకుల వలసలతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీ ఈ పరిస్థితులకు కారణం 'వాస్తు దోషం'గా భావిస్తోంది. మొదటి నుంచి వాస్తును బాగా నమ్మే ఆ పార్టీ ఇప్పుడు పార్టీకి ఏర్పడిన పరిస్థితికి వాస్తు దోషం కారణమని నమ్ముతోంది. వాస్తు మార్పులు చేస్తే పరిస్థితి మెరుగవుతుందనే భావనలో ఉన్న ఆ పార్టీ నివారణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పార్టీ కార్యాలయంలో వాస్తు మార్పులు ప్రారంభించింది.
Also Read: Gangula Kamalakar: బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి గంగుల కమలాకర్.. ఎంపీగా ఛాన్స్?
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వాస్తు శాస్త్రాన్ని బాగా విశ్వసిస్తారు. ఆయన రాజకీయంగా.. వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా.. ఏ కార్యక్రమం చేపట్టినా వాస్తు, జ్యోతిష్యం, ముహూర్తాలు చూసుకుంటారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ప్రస్తుతం పార్టీ నాయకుల ఫిరాయింపులతో కేసీఆర్‌కు తలనొప్పిగా మారింది. ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటుండడంతో కేసీఆర్ పండితులను ఆశ్రయించారని సమాచారం. పండితులు పార్టీ కార్యాలయంలో వాస్తు దోషాలు ఉన్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. వారి సూచన ప్రకారం పార్టీ కార్యాలయంలో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: KTR: రేవంత్ రెడ్డి మగాడివైతే.. దమ్ముంటే హైదరాబాద్‌కు నీళ్లు ఇవ్వు: కేటీఆర్ సవాల్
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ ఉంది. ఈ భవనంలో పలు వాస్తు మార్పులు చేసేందుకు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యాలయం తూర్పు ముఖంగా ఉంది. వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి ఎప్పటి నుంచో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ గేటు నుంచి రాకపోకలు సాగించడం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చారు. ప్రత్యామ్నాయంగా ఈశాన్యం వైపు ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికితోడు వీధిపోటు కూడా ఉందని గ్రహించారు. దీనికి విరుగుడుగా లక్ష్మీనరసింహా స్వామి చిత్రం గేటుకు ఏర్పాటుచేయడం గమనార్హం.
పండితుల సూచనల మేరకు ఈశాన్యం గేటు వినియోగానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు ఆ గేటు నుంచి పెద్దగా రాకపోకలు సాగించలేదు. దీంతో వాహనాలు వెళ్లేందుకు ర్యాంపు సక్రమంగా లేదు. ఇప్పుడు వాస్తు మార్పు కారణంగా ఆ గేటు వద్ద మరమ్మతులు చేపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ పనులు జరుగుతున్నాయి. గేటు మార్పు వలన వాస్తు దోషం నివారణతోపాటు మా మార్గంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుందని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ సూచనలు సలహాల మేరకు పార్టీ కార్యాలయం ప్రాంగణంతోపాటు కార్యాలయం లోపల వాస్తు మార్పులు జరుగుతున్నాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పులతో లోక్‌సభ ఎన్నికల్లో కొంత సానుకూల పవనాలు ఉంటాయని భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook