Telangana Ration Cards: సంక్రాంతి పండుగ తర్వాత రైతులందరికీ రైతు భరోసా కింద ఒక ఎకరానికి రూ.12 వేలు అమలు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయానికి యోగ్యానికి అనుకూలమైన భూములకు పంటలు వేసినా వేయకున్నా రైతు బంధు వేస్తామని స్పష్టం చేశారు. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు కూలీలకు రూ.12 వేలు అందజేస్తామని, అర్హులైన అందరికీ నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని ప్రకటించారు.
Also Read: Revanth Reddy: అమరావతిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. 'పోలిక అసలు వద్దు'
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఆదివారం ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృత పర్యటన చేపట్టి రూ.18.57 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కల్లూరులో అభివృద్ధి పనులతో పాటు శంకుస్థాపన చేసి రాష్ట్రస్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఒక్కొక్కరికి 6 కేజీల సన్న బియ్యం అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వానికి అందరి సంపూర్ణ మద్దతు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల కాంగ్రెస్ కు కంచుకోట అని జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% ఫలితాలు రావాలని కోరారు.
Also Read: Cheetah Tension: హైదరాబాద్‌లో చిరుతపులి హల్‌చల్.. భయాందోళనలో స్థానికులు
ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయం సమానంగా తీసుకుని వెళుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీసీ,ఎస్సీ వర్గీకరణ చేసి అందరికీ సమానంగా న్యాయం జరిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. తామంతా కలిసి 24 గంటలు 365 రోజులు ప్రజల మేలు కోసం.. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాల ప్రజలు చూపెడుతున్న అభిమానాన్ని, ఆప్యాయతలను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రుణం కోసం తీర్చుకుంటానని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.