Maoists Killed In Encounter: తెలంగాణలో భారీ ఎత్తున ఎన్‌కౌంటర్ జరిగింది. గ్రే హౌండ్ బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో వారికి మావోయిస్టులు ఉనికి తెలిసింది. దీంతో భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా మావొయిస్టులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో భారీ ఎత్తున ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 10 మంది మావోలు మృతి చెందారు. ఈ ఉదాంతం మరువక ముందే మరో భారీ ఎన్ కౌంటర్ తెలంగాణలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం గుండాల, కరకగూడెం రఘునాథ పాలెం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సందర్భంలో ఆరుగురు మావోలు అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు. అయితే, కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లచ్చన్నతోపాటు ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనతో ఏజెన్సీ ప్రాంతాలను ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తం చేశారు. సరిహద్దు ప్రాంతాలు, గ్రామాలపై కూడా నిఘా పెంచారు. ఈ రెండు భారీ ఎన్‌కౌంటర్లు మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బే. అక్కడక్కడా ఎన్‌కౌంటర్లు జరిగినా ఇంత పెద్ద మొత్తంలో అత్యంత తక్కువ సమయంలో వెను వెంటనే చోటు చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ తమ కూంబింగ్ ముమ్మరం చేశారు. దీంతో వారికి మావోయిస్టులు తారసపడినప్పుడు కాల్పులు జరుగుతున్నాయి. దీనికి వారు కూడా ఎదురు కాల్పులు జరుపుతున్నారు. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఇదీ చదవండి: బంపర్ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?
ఛత్తీస్‌ఘడ్లో మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా అగ్రనేత రణధీర్ అలియాస్ జగన్ మరో ఆరుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఈ అగ్రనేత హన్మకొండ టేకుల గూడెం గ్రామానికి చెందినవారు. ఈ నేత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. దీంతో రణధీర్ పై రూ.25 లక్షల రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతతోపాటు మదకామ, కవిత, లలిత, కోస మాధవి. గంగీ, శాంతి, కమలేశ్ మృతి చెందారు. మృతి చెందిన వీరందరిపై ప్రభుత్వం రివార్డు ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరి వద్ద నుంచి భారీ ఎత్తున మందు గుండు సామగ్రీ, ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇదీ చదవండి: రేపు టీచర్స్ డే సందర్భంగా మీ ఉపాధ్యాయులకు ఈ 5 బహుమతులుగా ఇవ్వచ్చు..
వీరంతా లచ్చన్న దళానికి చెందినవారుగా బలగాలు నిర్ధారించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వీరిని స్థానిక మణుగూరు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇక మావోయిస్టు అగ్రనేత లచ్చన్న పై పలు పోలీసు స్టేషన్లలో 50 కి పైగా కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.అయితే మృతుల్లో లచ్చన్న కూడా ఉన్నారనే ప్రచారం కొనసాగుతోంది. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter