Ganesh Immersion:హైదారాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై మళ్లీ వివాదం మొదలైంది. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని ప్రభుత్వం చెబుతుండగా.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం తగ్గేదే లే అంటోంది. గణేష్ విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. హుస్సేన్ సాగర్ లొనే విగ్రహాలను నిమజ్జనం చే,ి చేసి తీరుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు చెప్పారు. విగ్రహాల తయారీ విషయ లో హై కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు.విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని భగవంత్ రావు హెచ్చరించారు. నిమజ్జనోత్సవానికి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురైనా తీవ్ర పరిణామాలు ఉంటాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హెచ్చరించింది.ఇక మండప నిర్వహకులు ఎవరికి ఇబ్బంది లేకుండా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని భగవంత్ రావు సూచించారు.
వినాయక విగ్రహాల తయారీ దారులకు తెలంగాణ హైకోర్టు గురువారం గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక నిమజ్జనంపైనా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే ప్రత్యేక కొలనుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో కేంద్ర పీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది, వాటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని తెలిపింది హైకోర్టు. విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థననూ తిరస్కరించింది.
వివాదమంతా విగ్రహాల తయారీపై కాదని, కేవలం నిమజ్జనానికి సంబంధించిన ఈ విషయంలో మాత్రమే వస్తుందని హైకోర్టు తెలిపింది.
Read also: Hyderabad Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. బయటికి రావొద్దని పోలీసుల హెచ్చరిక
Read also: CBSE 12th results 2022: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook