Telangana New Secretariat: సచివాలయం ప్రారంభోత్సవం వాయిదాకు అసలు కారణం ఇదే..? వాళ్లు హ్యాండ్ ఇవ్వడంతోనే..!

Telangana New Secretariat Inauguration Postponed: తెలంగాణకు మణిహారంగా.. అత్యాద్భుతమైన డిజైన్‌తో కళాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం అనూహ్యంగా వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అని అధికారులు కారణం చెబుతుండగా.. అసలు కారణం వేరే ఉందంటూ కొందరు వాదిస్తున్నారు. వాళ్లు హ్యాండ్ ఇవ్వడంతోనే వాయిదా వేశారంటు చర్చించుకుంటున్నారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2023, 09:13 AM IST
Telangana New Secretariat: సచివాలయం ప్రారంభోత్సవం వాయిదాకు అసలు కారణం ఇదే..? వాళ్లు హ్యాండ్ ఇవ్వడంతోనే..!

Telangana New Secretariat Inauguration Postponed: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన సరికొత్త హంగులతో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం పూర్తైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు చేశారు. అయితే సడెన్‌గా ఆ ప్రొగ్రామ్ వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోడ్ అమలులోకి వచ్చినందున సచివాలయ ప్రారంభోత్సం వాయిదా పడిందని అధికారులు ప్రకటించారు. కానీ తాజాగా మరో కారణం వెలుగులోకి వస్తోంది. సచివాలయ ప్రారంభోత్సం తేదీని ముందే ప్రకటించారు కాబట్టి ఎన్నికల కోడ్ పెద్ద ఇబ్బంది కాదని కొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సీఈసీకి రిక్వెస్ట్ పెడితే.. సమస్య పరిష్కరం అయ్యేదంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని చెబుతున్నారు.

ఏపీలో ఇలా..

ప్రస్తుతం ఏపీలోనూ ఎమ్మెల్యీ ఎన్నికల కోడ్ ఉంది. అయినా నేడు (బుధవారం) కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఏపీలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చిందన్నదే ఇప్పుడు చర్చగా మారింది. తెలంగాణలో కేవలం మూడు స్థానాలకే ఎన్నిక జరుగుతుంది.. కాని ఏపీలో 1౩ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయినా అక్కడ ముందే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం జరుగుతుండగా.. తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సం వాయిదా పడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆహ్వానించిన అతిథులు హ్యాండ్ ఇవ్వడం వల్లే సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది. 

తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను సచివాలయ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయపరమైన కారణాలతో స్టాలిన్, తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమానికి  రాలేమని తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం పంపినట్లు సమాచారం. తమిళనాడులో యూపీఏ కూటమితో కలిసి ఉన్నారు స్టాలిన్. కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 

బీహర్‌లోనూ యూపీఏ కూటమి అధికారంలో ఉంది. దీంతో తేజస్వి యాదవ్ సైతం హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీ సైతం కాంగ్రెస్‌ తో స్నేహ సంబంధాల్లోనే ఉన్నది. దీంతో హేమంత్ సోరెన్ సైతం హైదరాబాద్ రావడానికి ఇష్టపడలేదంటున్నారు. పిలిచిన అతిథులు రాకపోతే జనాల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందన్న కారణంతోనే సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారనే చర్చ సాగుతోంది.

Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!  

Also Read: Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News