Dharmapuri Aravind vs Kavitha: టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల కవిత పంపించిన గూండాలే తన నివాసంపై దాడి చేసి తన తల్లి, ఇంట్లో సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడి భయబ్రాంతులకు గురిచేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. నీ వెంటపడి తంతం, కొట్టి కొట్టి చంపుతామంటూ వ్యాఖ్యలు చేశారని.. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే సుమారు 50 మంది టిఆర్ఎస్ గూండాలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని ధర్మపురి అరవింద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
On the direction of our BJP legal cell, filing a complaint against Ms. Kavitha Kalvakuntla. pic.twitter.com/8HbhnaOTzM
— Arvind Dharmapuri (@Arvindharmapuri) November 18, 2022
ఆ 50 మంది టిఆర్ఎస్ నాయకులని తనపైకి ఉసిగొల్పి ఇంటికి దాడికి పంపించింది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనని అరవింద్ తన ఫిర్యాదు ద్వారా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. తన ఇంటిపై దాడి ఘటనకు బాధ్యురాలైన కల్వకుంట్ల కవితపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్మపురి అరవింద్ బంజారాహిల్స్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
For rest of India ... this is from Hyderabad ... @BJP4India MP Sri @Arvindharmapuri house attacked by goons of TRS . By the way Democracy is in danger brigade is in deep slumber . https://t.co/xetevlWXRr
— B L Santhosh (@blsanthosh) November 18, 2022
ఇదిలావుంటే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై దాడికి పాల్పడిన వారిపై బంజారాహిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అరవింద్ నివాసంపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించిన ఘటనలో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కేసులు నమోదు అయిన వారిలో టీఆర్ఎస్ నేతలు రాజా, రామ్ యాదవ్, మన్నే గోవర్దన్ రెడ్డి, టీఆర్ఎస్‌వి నేత స్వామి ఉన్నట్టు సమాచారం. ధర్మపురి అరవింద్ నివాసంపై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలో ఏం జరుగుతుందో యావత్ దేశం చూస్తోందంటూ బీజేపి జాతీయ స్థాయి నాయకులు సైతం ధర్మపురి అరవింద్‌కి ( Dharmapuri Aravind ) అండగా నిలుస్తున్నారు.
Also Read : DK Aruna: ఎంపీ అరవింద్ కుటుంబానికి ప్రాణహాని ఉంది.. ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలి: డీకే అరుణ
Also Read : MP Dharmapuri Arvind: ఎంపీ అరవింద్ ఇంటి వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తల హంగామా.. ఇంటి అద్ధాలు, ఫర్నీచర్ ధ్వంసం!
Also Read : నా గురించి ఇంకోసారి మాట్లాడితే.. చెప్పుతో కొడతా! ఎంపీ అరవింద్‌కి కవిత స్ట్రాంగ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook