Telangana Assembly Session: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా వ్యవసాయ రంగానికి చేస్తున్న అన్యాయాలపై.. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.. ఇబ్బందులపైన అసెంబ్లీలో గళం విప్పాలని నిర్ణయించినట్లు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని తమ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
Also Read: KTR Harish Rao Arrest: రేవంత్ రెడ్డి నీ పిట్ట బెదిరింపులకు భయపడం.. ప్రశ్నిస్తే కేసులా?
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శాసనమండలి, శాసనసభ పక్షంతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దాదాపు మూడు గంటలుగా కొనసాగిన సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేటీఆర్ వివరించారు. శాసనమండలి, శాసనసభ్యులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు వెల్లడించారు.
'రైతులకు ఉన్న మద్దతు కార్యక్రమాలను రైతు భరోసాను పక్కనపెట్టి కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టింది. రైతు రుణమాఫీని అరకొరగా పూర్తి చేసింది. బోనస్ మద్దతు ధర రైతు కూలీల అంశం వంటి అన్ని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం' అని కేటీఆర్ తెలిపారు. గురుకులాల్లో నెలకొన్న సంక్షోభాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాల బిడ్డల భవిష్యత్తుకు ఆధారమైన గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం పతనావస్థకు చేర్చిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం గురుకుల బాట పేరుతో క్షేత్రస్థాయిలో గురుకులాలను సందర్శించి నివేదికను కేసీఆర్‌కు ఇచ్చాం. కేసీఆర్ హయాంలో గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్ది నిర్వహిస్తే ఈరోజు గురుకుల వ్యవస్థను రేవంత్ రెడ్డి సంక్షోభంలోకి నెట్టాడు. గురుకులాలతో బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పిల్లల భవిష్యత్తును నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని.. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం' అని కేటీఆర్ ప్రకటించారు.
'హైదరాబాద్ ఫార్మాసిటీ భూములు సేకరించి పరిశ్రమల స్థాపనకు అన్ని సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 20 చోట్ల ఫార్మా విలేజ్ల పేరుతో రైతుల భూములను గుంజుకుంటున్న ప్రభుత్వ కుట్రపై నిలదీస్తాం' అని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన దమనకాండను కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల సమస్యలు, దళిత బంధు రెండో విడత డబ్బులు పెండింగ్, ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలుపై అసెంబ్లీ సాక్షిగా ఎండగడతామని కేటీఆర్ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.