Telangana: సీఎం కేసీఆర్ ను కలిసిన ఆపిల్ రైతు..

దక్షిణ భారత దేశ కాశ్మీర్ గా పిలిచే ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు చేసిన ప్రయోగం ఇప్పుడు దేశమంతా ఆశ్చ్యర్యపడుతోంది. ఆపిల్ సాగులో పైచేయి సాధించడం అందరిని ఆకట్టుకుంటోంది. కొమురం భీం ఆసిఫాబాద్ 

Last Updated : Jun 3, 2020, 12:00 AM IST
Telangana: సీఎం కేసీఆర్ ను కలిసిన ఆపిల్ రైతు..

హైదరాబాద్: దక్షిణ భారత దేశ కాశ్మీర్ గా పిలిచే ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు చేసిన ప్రయోగం ఇప్పుడు దేశమంతా ఆశ్చ్యర్యపడుతోంది. ఆపిల్ సాగులో పైచేయి సాధించడం అందరిని ఆకట్టుకుంటోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధోనోరా గ్రామవాసి బాలాజీ ఓ రైతు ప్రయోగామాత్మకంగా ఆపిల్ పంట వేసి విజయం సాధించాడు. 

Also Read: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళవారం నాడు తన తొలి పంటను సీఎం కేసీఆర్ కు అందజేశాడు. ప్రగతి భవన్ కు వెళ్లిన రైతు బాలాజీ తానూ పండించిన ఆపిల్ పండ్ల బుట్టను ముఖ్యమంత్రికి అందజేశాడు. ప్రతికూల వాతావరణంలో, ప్రకృతి రీత్యా సహకరించకపోయినా ఈ వాతావరణంలో ఆపిల్ సాగు చేసి అధిక దిగుబడులు సాధించిన రైతు బాలాజీని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. హైదరాబాద్ లో ఉన్న సీసీఎంబీ, వ్యవసాయ శాఖ సలహాలతో ఆపిల్ ను వాణిజ్య పంటగా సాగు చేస్తున్న రైతు బాలాజీ తెలంగాణ రైతాంగంతో పాటు, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News