Agnipath Riots: కేసీఆర్ రాజకీయ అస్త్రంగా అగ్నిపథ్.. రాకేష్ డెడ్ బాడీతో భారీ ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్?

Agnipath Riots: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ టార్గెట్ గానే అడుగులు వేస్తున్నారు. మోడీ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ ముక్త భారత్ నినాదం ఇస్తున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు గులాబీ బాస్.

Written by - Srisailam | Last Updated : Jun 18, 2022, 09:29 AM IST
  • నర్సంపేటలో టీఆర్ఎస్ బంద్
  • కేసీఆర్ రాజకీయ అస్త్రంగా అగ్నిపథ్..
  • రాకేష్ డెడ్ బాడీతో టీఆర్ఎస్ ర్యాలీ?
Agnipath Riots: కేసీఆర్ రాజకీయ అస్త్రంగా అగ్నిపథ్.. రాకేష్ డెడ్ బాడీతో భారీ ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్?

Agnipath Riots: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ టార్గెట్ గానే అడుగులు వేస్తున్నారు. మోడీ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ ముక్త భారత్ నినాదం ఇస్తున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు గులాబీ బాస్. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించారు. చైనా బార్డర్ లో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సాయం చేశారు. తాజాగా దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు రాజుకున్నాయి. ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ ను బీజేపీకి వ్యతిరేకంగా తన జాతీయ రాజకీయాలకు అస్త్రంగా వాడుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా యువకులు చేపట్టిన ఆందోళన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హింసాత్మకంగా మారింది. నిరసనకారులు విధ్వంసానికి దిగగా.. రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఫైరింగ్ లో రాకేష్ అనే యువకుడు చనిపోగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్ ఆందోళన, కాల్పుల ఘటనకు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. కాల్పుల్లో చనిపోయిన రాకేష్ ది వరంగల్ జిల్లా. దీంతో వరంగల్ జిల్లాలో భారీ నిరసనలకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గ బంద్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్జి పిలుపిచ్చారు. ఇక రాకేష్ డెడ్ బాడీతో నర్యంపేటలో భారీ ర్యాలీ తీయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. వరంగల్ ఎంజీఎం నుంచి నర్సంపేట మీదుగా రాకేష్ స్వగ్రామం దబీల్ పురా వరకు ర్యాలీ తీయడానికి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే నర్సంపేట బంద్ కు ఎమ్మెల్యే పెద్ది పిలుపిచ్చారని తెలుస్తోంది. అధికార పార్టీ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉదయాన్నే ఎంజీఎంకు వచ్చి రాకేష్ మృతదేహానికి నివాళి అర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విఫ్ వినయ్ భాస్కర్ కూడా ఎంజీఎంకు వచ్చారు. ముఖ్యమంత్రి సూచనలతోనే వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలంతా రాకేష్ డెడ్ బాడీతో ర్యాలీకి ప్లాన్ చేశారని సమాచారం. రాకేష్ మృతిపై విచారం వ్యకం చేసిన కేసీఆర్.. 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మోడీ దుర్మార్గ విధానాలకు రాకేష్ బలయ్యాడని కేసీఆర్ ఆరోపించారు. దీంతో అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుని బీజేపీపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నిరసనలకు దిగిందని చెబుతున్నారు. రాకేష్ అంత్యక్రియలకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు వస్తారని తెలుస్తోంది.

Read also: Agnipath Protests Effect: 'అగ్నిపథ్' అల్లర్ల ఎఫెక్ట్.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మూసివేత.. 

Read also: PM Modi: శత వసంతంలోకి హీరాబెన్.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News