హైదరాబాద్ లో ఐదంతస్థుల 'క్రిస్మస్ ట్రీ' ని చూశారా?

క్రిస్మస్ కు ఇక కొద్ది గంటలే సమయం ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఒక కప్ కేక్ క్రిస్మస్ ట్రీ ని  సిద్ధం చేశారు నిర్వాహకులు

Last Updated : Dec 25, 2017, 11:39 AM IST
హైదరాబాద్ లో ఐదంతస్థుల 'క్రిస్మస్ ట్రీ' ని చూశారా?

క్రిస్మస్ కు ఇక కొద్ది గంటలే సమయం ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఒక 'కప్ కేక్ క్రిస్మస్ ట్రీ' ని సిద్ధం చేశారు నిర్వాహకులు. దాని ఖరీదు 7.5 లక్షలు. దీనిని తయారుచేయడానికి వారం రోజులు పట్టింది. 

హైదరాబాద్ నగరం పేరు క్రిస్మస్ సందర్భంగా కీర్తిగడించాలని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా (సిఏఐ) భారీ కప్ కేక్ క్రిస్మస్ చెట్టును నిర్మించి గిన్నిస్ రికార్డును సృష్టించేందుకు ప్రయత్నించింది.

57-అడుగుల పొడవాటి క్రిస్మస్ చెట్టు 51 అంచెలుగా శాఖలను కలిగి ఉంది. వీటిలో ప్రతి శాఖలో అనేక కప్ కేకులు అలంకరించారు. మొత్తం మీద, సిఏఐ చెఫ్లు కప్ కేక్ క్రిస్మస్ చెట్టు కోసం 850 కిలోల బరువుతో 7,500 కప్ కేక్లను ఉపయోగించారు.

సిఏఐ డైరెక్టర్ సుధాకర్ రావు మాట్లాడుతూ-  "మేము స్ట్రాబెర్రీ, పైనాపిల్, కొబ్బరి, చాక్లెట్ మొదలైన 20 రకాల ఫ్లేవర్లతో కప్ కేక్లను మూడు సైజుల్లో రూపొందించాము. షుగర్ పేస్ట్ ఫ్లవర్స్, ఎడిబుల్ క్రిస్మస్ గూడీస్, చాక్లెట్ సీతాకోకచిలుకలు మరియు ఎడిబుల్ స్ప్రింక్లర్లతో కప్ కేకులను గార్నిష్ చేసాము" అన్నారు. 

సిఏఐ ప్రకారం, కప్ కేక్ క్రిస్మస్ చెట్టు కోసం 7.5 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. సుమారు 100 జూనియర్ చెఫ్లు, 20 అధ్యాపక బృందాలు ఒక వారం రోజులుగా దీనికోసం పనిచేశారు. రెండు రోజుల నుంచి ఫ్రెష్ కప్ కేకు కోసం పనిచేశారు. 

ఈ కప్ కేకు క్రిస్మస్ చెట్టు ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా ఘనత సాధించింది. సుధాకర్ రావు మాట్లాడుతూ.. " 57-అడుగుల అతిపెద్ద కప్ కేకు చెట్టు, దక్షిణాఫ్రికాలో చెఫ్లు సెట్ చేసిన రికార్డును అధిగమించింది.  40 అడుగుల కప్ కేక్ క్రిస్మస్ చెట్టును 4,000 కప్ కేకులను ఉపయోగించి వారు దాన్ని తయారుచేశారు" అన్నారు. ఈ భారీ క్రిస్మస్ కేకు బేగంపేట్ కుందన్ బాగ్ ఉమనగర్ లో ఉంది. వెళ్లి ఒకసారి చూసేసి రండి.

Trending News