Corona in Telangana: తెలంగాణలోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in Telangana) బయటపడ్డాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 84కు చేరింది.
ఇక రాష్ట్రానికి గడిచిన 24 గంటల్లో 163 మంది రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చారు. అందులో 14 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. వారికి సోకిందా ఒమిక్రాన్ వేరింయంటా? అని నిర్ధారించుకునేందుకు శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.
కొవిడ్ కేసులు ఇలా..
రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో 274 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం (Corona cases in Telangana) వెల్లడించింది. మొత్తం 21,679 శాంపిళ్లను పరీక్షించగా ఈ కేసులు బయటపడినట్ల వివరించింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,779 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా కొవిడ్ తీవ్ర రూపం..
దేశంలో కొవిడ్ మళ్లీ తీవ్ర రూపం దాల్చినట్లు (Corona in India) తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 11,877 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయిలోనే 8,063 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 42వేలు దాటింది.
ఢిల్లీలో కూడా ఒక్క రోజులోనే 3 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ్ బెంగాల్లోనూ కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
Also read: Gang War: ఎల్బీ నగర్లో మందుబాబుల మధ్య గొడవ- ఓ యువకుడు మృతి!
Also read: Hyderabad: మిఠాయి పాడైందని నెటిజన్ ట్వీట్...జీహెచ్ఎంసీ రియాక్షన్.. కరాచీ బేకరీకి రూ.10వేల జరిమానా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు- మొత్తం @ 84
తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్ కేసులు
కొత్తగా 274 మందికి పాజిటివ్, 5 ఒమిక్రాన్ కేసులు
ఇతర రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్ర రూపం