Xiaomi 14 Ultra Global Edition: శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Xiaomi 14 Ultra గ్లోబల్‌ ఎడిషన్‌..ఫీచర్స్‌, విడుదల వివరాలు ఇవే!

Xiaomi 14 Ultra Global Edition: శక్తివంతమైన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌తో మార్కెట్‌లోకి Xiaomi 14 Ultra గ్లోబల్ ఎడిషన్‌ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మోడల్‌ నెంబర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 12:48 PM IST
Xiaomi 14 Ultra Global Edition: శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Xiaomi 14 Ultra గ్లోబల్‌ ఎడిషన్‌..ఫీచర్స్‌, విడుదల వివరాలు ఇవే!

 

Xiaomi 14 Ultra Global Edition Expected Launching: ప్రముఖ టెక్‌ కంపెనీ షియోమి (Xiaomi) గుడ్‌ న్యూస్‌ తెలిపింది. షియోమి ఇటీవలే విడుదల చేసిన 14 అల్ట్రా మోడల్‌ వేరియంట్‌ను గ్లోబల్‌ ఎడిషన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన వివరాలను పలువు టిప్‌స్టర్స్‌ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్‌ చేశారు. 2024 సంవత్సరంలో షియోమి (Xiaomi) 14 అల్ట్రా మోడల్‌ వేరియంట్‌తో పాటు మిక్స్ ఫ్లిప్, ప్యాడ్ 7 సిరీస్ టాబ్లెట్‌లు, మిక్స్ ఫోల్డ్ 4లను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన సమాచారాన్ని కొన్ని చైనా వార్త సంస్థలు వెల్లడించాయి. ఈ ఎడిషన్‌ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు క్లాసిక్‌ లుక్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లోబల్‌ ఎడిషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

షియోమి 14 అల్ట్రా గ్లోబల్‌ ఎడిషన్‌ మార్కెల్‌లోకి మొత్తం రెండు మోడల్స్‌లో విడుదల కాబోతుంది. అయితే ఇప్పటికే కంపెనీ 24030PN60G, 24030PN60C  మోడల్ నంబర్లుగా పేర్కొంది. దీంతో పాటు ఇప్పటికే ఈ మోడల్స్‌కి  గ్లోబల్ వెర్షన్ TUV రైన్‌ల్యాండ్ నుంచి ఆమోదం కూడా లభించింది. అయితే కంపెనీ ఈ గ్లోబల్ సిరీస్‌లకు సంబంధించిన ఎటువంటి ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ను వెల్లడించలేదు. కాబట్టి ఈ మొబైల్స్‌ సంబంధించిన లాంచ్‌ వార్తలు సోషల్‌ వీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పలు చైనా వార్త సంస్థలు అందించిన వివరాలు ప్రకారం.. చైనీస్ వేరియంట్ ఈ నెలాఖరులో లాంచ్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను షియోమి అధికారికంగా త్వరలోనే విడుదల చేసే ఛాన్స్‌ కూడా ఉంది. 

గత సంవత్సరంలోని ఆగస్ట్‌ నెలలో IMEI డేటాబేస్‌లో మోడల్ నంబర్ 23041PN0DCతో Xiaomi గ్లోబల్‌ ఎడిషన్‌ను పేర్కొన్నారు. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వివరించలేకపోయిన దీనిపై ఊహాగానాలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మొబైల్‌ త్వరలోనే విడుదల కాబోతున్న Civi 4 వేరియంట్‌ లాగే ఉండే ఛాన్స్‌ కూడా ఉందని టాక్‌..ఇటీవలే TUV రైన్‌ల్యాండ్ డేటాబేస్‌లో కూడా  Civi 4కి సంబంధించి మోడల్, ఫోటోస్‌ కూడా స్క్రీన్‌షాట్‌ రూపంలో వైరల్‌ అయ్యాయి. ఇది డైమెన్సిటీ 8300-అల్ట్రా చిప్‌సెట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
షియోమి 14 అల్ట్రా గ్లోబల్‌ ఎడిషన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పటికీ కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే అతి త్వరలోనే ఈ ఎడిషన్‌కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెల్లడించే ఛాన్స్‌ ఉందని పలువులు చైనీస్‌ టిప్‌స్టర్స్‌ తెలిపారు. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌, లుక్‌లోనే లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది శక్తివంతమైన బ్యాటరీ, కెమెరాతో అందుబాటులోకి రానుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News