iPhone 14 Stolen By Woman: సెక్యురిటీ వైర్ కొరికేసి మరీ ఐ ఫోన్ చోరీ.. వీడియో వైరల్

iPhone 14 Plus Stolen By Woman: తాజాగా ఓ మహిళ స్టోర్‌లో ఐఫోన్ 14 ప్లస్ కొట్టేస్తూ అక్కడున్న సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. ఐఫోన్ 14 ప్లస్‌ని దొంగిలించే క్రమంలో ఆ మహిళ ఏం చేసిందో చూస్తే ఎంతటి చోరుడైనా షాక్ అవ్వాల్సిందే. ఐఫోన్ కోసం ఇంత సాహసం ఏంట్రా బాబూ అని ఆశ్చర్యపోవాల్సిందే. 

Written by - Pavan | Last Updated : Sep 3, 2023, 06:07 PM IST
iPhone 14 Stolen By Woman: సెక్యురిటీ వైర్ కొరికేసి మరీ ఐ ఫోన్ చోరీ.. వీడియో వైరల్

iPhone 14 Plus Stolen By Woman: స్మార్ట్‌ఫోన్స్ నందు యాపిల్ ఐఫోన్ స్మార్ట్ ఫోన్ వేరయా.. ఔను ఈ దేశం.. ఆ దేశం అని తేడా లేకుండా ప్రపంచం మొత్తంగా ఏ మూలకు వెళ్లినా.. నిత్యం మార్కెట్లోకి ఎన్ని స్మార్ట్ ఫోన్స్ వస్తున్నా... ఐఫోన్‌కి ఉన్న క్రేజు మాత్రం ఇసుమంతైనా తగ్గడం లేదు. ఏది ఏమైనా సరే.. ఎంత కష్టపడైనా సరే ఐఫోన్ కొని తీరాల్సిందే అని అనుకునే ఐఫోన్ లవర్స్‌కి కొదువే లేదు. డబ్బు చెల్లించి ఆ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు ఎంత కష్టపడి అయినా సరే పని చేసి ఆ ఫోన్ దక్కించుకోవాలి అని భావిస్తారు. కానీ డబ్బులు పెట్టకుండా కొట్టేసి ఆ ఫోన్ సొంతం చేసుకోవాలి అని అనుకునే వారు కూడా ప్రపంచంలో చాలామందే ఉన్నారు. అందుకే ఐఫోన్ కోసం చోరీలు, నేరాలు, ఘోరాలు చేసిన వాళ్లు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు. 

తాజాగా ఓ మహిళ స్టోర్‌లో ఐఫోన్ 14 ప్లస్ కొట్టేస్తూ అక్కడున్న సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. ఐఫోన్ 14 ప్లస్‌ని దొంగిలించే క్రమంలో ఆ మహిళ ఏం చేసిందో చూస్తే ఎంతటి చోరుడైనా షాక్ అవ్వాల్సిందే. ఐఫోన్ కోసం ఇంత సాహసం ఏంట్రా బాబూ అని ఆశ్చర్యపోవాల్సిందే. ఐఫోన్ కొట్టేసే ప్రయత్నంలో భాగంగా ఆ మహిళ ముందుగా ఫోన్ కి అనుసంధానం చేసి ఉన్న సెక్యురిటీ వైర్ ప్లగ్ పీకేసే ప్రయత్నం చేసింది. కానీ అది ఫలించలేదు. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కానీ ఆ మహిళ.. సెక్యురిటీ వైర్ ని నోటితోనే కట్ చేసింది. 

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో పబ్లిష్ అయిన ఓ వార్తా కథనం ప్రకారం.. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌కి చెందిన క్యూ అనే మహిళ ఈ నేరానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్లస్‌ని దొంగిలించే ముందు సెక్యురిటీ ప్లగ్ ని వేరు చేసేందుకు ప్రయత్నించడం, అది కుదరకపోవడంతో చివరి ప్రయత్నంగా నోటితో సెక్యురిటీ వైర్ కొరికేయడం అక్కడి సెక్యురిటీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆమె చోరీకి పాల్పడే సందర్భంలో సెక్యురిటీ అలారం మోగినప్పటికీ.. అది పొరపాటున వచ్చిన ఫేక్ అలారం అనే అనుకున్నారంతా. అందుకే ఆ అలారం ఆపేశారు. కానీ అది నిజంగానే చోరీ చేసేటప్పుడు వచ్చిన అలారం అని ఆ సమయంలో స్టోర్ లో ఉన్న వాళ్లు గమనించలేకపోయారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె దొంగిలించిన యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ ఖరీదు అక్కడి స్థానిక కరెన్సీలో 7,000 యువాన్లు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు 79,749 రూపాయలు. ఆమె సెక్యురిటీ కేబుల్‌ను కొరికి ఆ ఫోన్‌ని తన బ్యాగులో పెట్టుకుని మొబైల్ స్టోర్ నుండి ఏమీ తెలియనట్టు అమాయకంగా బయటికి వెళ్లిపోయింది. ఆ మహిళ స్టోర్ నుండి బయటకు వెళ్లిపోయిన తరువాత అక్కడ డిస్‌ప్లే కోసం ఏర్పాటు చేసిన ఐఫోన్ 14 ప్లస్ చోరీకి గురైంది అని గుర్తించిన స్టోర్ సిబ్బంది.. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించి చూసి షాక్ అయ్యారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News