Twitter Jobs: ఉద్వాసన కాదిప్పుడు..కొత్తగా వేలాది ఉద్యోగ నియామకాలు

Twitter Jobs: ట్విట్టర్ కొత్త అధినేత ఎలాన్ మస్క్ గుడ్‌న్యూస్ అందించారు. వేలాదిగా ఉద్యోగుల్ని తొలగించిన తరువాత..ఇప్పుడు కొత్తగా నియామకాలు చేపడుతున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 22, 2022, 03:48 PM IST
  • ట్విట్టర్‌లో ఇప్పుడు ఉద్వాసన కాదు..వేలాదిగా ఉద్యోగాలు
  • ట్విట్టర్ బ్లూటిక్ కొత్త ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఎలాన్ మస్క్
  • ట్విట్టర్‌లో కొత్తగా ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్, సేల్స్ ఉద్యోగాల భర్తీ
Twitter Jobs: ఉద్వాసన కాదిప్పుడు..కొత్తగా వేలాది ఉద్యోగ నియామకాలు

ట్విట్టర్ సంస్థను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న తరువాత వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగించేశారు. ఇప్పుడు అదే ఎలాన్ మస్క్..ట్విట్టర్‌లో కొత్తగా నియామకాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ట్విట్టర్ సంస్థ ఇటీవలికాలంగా తరచూ వార్తల్లో ఉంటోంది. ప్రముఖ సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కొనుగోలు ప్రక్రియ ముగిసిన వెంటనే పెద్దఎత్తున ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశారు ఎలాన్ మస్క్. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తున్నారు. కొత్తగా నియామకాల్ని చేపట్టనున్నట్టు ఎలాన్ మస్క్ తెలిపారు. మరోవైపు కొత్త ఉద్యోగాల్లో సాఫ్ట్‌వేర్ తయారుచేసేవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. టెస్లా విషయంలో చేసినట్టుగా ట్విట్టర్ హెడ్‌క్వార్టర్‌ను టెక్సాస్‌లో పెట్టడం లేదన్నారు.

ఉద్యోగులతో జరిగిన ఓ భేటీలో..ఇకపై ఇంజనీరింగ్, సేల్స్‌లో కూడా నియామకాలు జరపనున్నట్టు ఎలాన్ మస్క్ తెలిపారు. కొత్తగా చేపట్టనున్న నియామకాలకై..ఎవరినైనా రిఫర్ చేయమని సూచించారు. టెక్సాస్‌తో పాటు కాలిఫోర్నియాలో కూడా హెడ్‌క్వార్టర్ ఉండవచ్చని తెలుస్తోంది. 

బ్లూటిక్ కొత్త ప్రతిపాదన నిలిపివేత

మరోవైపు ట్విట్టర్ బ్లూటిక్‌ను కొత్తగా ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని ప్రస్తుతానికి నిలిపివేసినట్టు ఎలాన్ మస్క్ తెలిపారు. విభిన్న సంస్థలు, వ్యక్తుల్ని నిర్ధారించేందుకు వేర్వేరు రంగుల్ని వినియోగించవచ్చని ఎలాన్ మస్క్ చెప్పారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొనుగోలు చేసిన తరువాత..ఎలాన్ మస్క్.. బ్లూ టిక్ 8 అమెరికన్ డాలర్లకు లభిస్తుందన్నారు. ఇదే వివాదాస్పదమైంది. నకిలీ ఎక్కౌంట్లు పెరిగిపోతాయనే ఆందోళన రేగింది.

నకిలీ ఎక్కౌంట్లను నియంత్రించడంలో విశ్వసాన్ని కలిగించేంతవరకూ బ్లూటిక్‌‌ను కొత్తగా ప్రవేశపెట్టే యోచనను నిలిపివేస్తున్నామన్నారు. బ్లూటిక్ విషయంలో ఎలాన్ మస్క్ గతంలో తీసుకున్న నిర్ణయంపై కాస్త ఆందోళన వ్యక్తమైంది. ఈ నిర్ణయం వల్ల నకిలీ ఎక్కౌంట్లు పెరిగిపోతాయనేది ఆ ఆందోళన. ఎవరికివారు తమను తాము రాజకీయ నేతలుగా, ఎంపీలుగా, ప్రెస్‌కు చెందిన వ్యక్తులుగా ప్రతిపాదించుకుంటారనే సందేహాలొచ్చాయి.

Also read: Buying TV, Cars, Fridges: ఇప్పుడు టీవీలు, కార్లు, ఫ్రిడ్జిలు కొంటున్నారా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News