Samsung New Laptop: శాంసంగ్ నుంచి 16 జీబీ ర్యామ్, ఐ7 తో కొత్త ల్యాప్‌టాప్, ధర, ఆఫర్లు ఇలా

Samsung New Laptop: ప్రముఖ టెక్ కంపెనీ శాంసంగ్ నుంచి మరో కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. మార్చ్ 22న ఇండియాలో లాంచ్ అయిన Samsung Galaxy Book 4 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర, ఆఫర్ల గురించి తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2024, 12:50 PM IST
Samsung New Laptop: శాంసంగ్ నుంచి 16 జీబీ ర్యామ్, ఐ7 తో కొత్త ల్యాప్‌టాప్, ధర, ఆఫర్లు ఇలా

Samsung New Laptop: ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ప్రో, శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 360, శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ప్రో 360 మోడల్స్‌కు దీటుగా ఈ కొత్త మోడల్ ల్యాప్‌టాప్ నిలవనుంది. వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ కోసం అద్భుతంగా పనిచేసేలా ఏ1 పవన్ ఫీచర్లు ఉంటాయి. ర్యామ్ కూడా ఎక్కువగా ఉండటంతో ల్యాప్‌టాప్ పనితీరు వేగంగా ఉంటుంది. 

శాంసంగ్ గెలాక్సీ బుక్ 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ఎల్ఈడీ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇంటెల్ కోర్ ఐ7 ప్రోసెసర్ ఉన్న సీపీయూ అందిస్తుంది. ఇందులో ఎ1 పవర్‌తో పాటు ఫోటో రీమాస్టర్ టూల్ ప్రత్యేకంగా ఉంటుంది. అంటే క్వాలిటీ తక్కువగా ఉండే ఫోటోల్ని రీమాస్టర్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ అయితే 54 వాట్స్ ఉంటుంది. యూఎస్‌బి టైప్ సి పోర్ట్ ద్వారా ఛార్జ్ అవుతుంది. వైఫై 6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ ఉంటుంది. మైక్రో ఎస్‌డి కార్డ్ రీడర్, ఆడియో జాక్ ఉంటాయి. 

ఇక శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లో ఇంటెల్ ఐ5 సీపీయూ ప్రోసెసర్ కలిగి 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 70,990 రూపాయలు కాగా, 16జీబీ ర్యామ్ అయితే 75,990 రూపాయలుంటుంది. అదే ఇంటెల్ కోర్ ఐ7 సీపీయూ ప్రోసెసర్ కలిగి 16 జీబీ ర్యామ్ అయితే 85,990 రూపాయలుగా ఉంది. గ్రే, సిల్వర్ రెండు రంగుల్లో ఈ ల్యాప్‌టాప్ లభ్యమౌతుంది. వివిధ రకాల బ్యాంక్‌ల నుంచి గెలాక్సీ బుక్ 4 కొనుగోలుపై 5000 రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. లేదా 4000 వరకూ అప్‌గ్రేడ్ బోనస్ ఆఫర్ ఉంటుంది. విద్యార్ధులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా 24 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు.

Also read: IPL 2024 Recharge Plans: అంతరాయం లేకుండా ఐపీఎల్ చూసేందుకు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News