Samsung Galaxy F15 5G Price: దిమ్మతిరిగే హోలీ ఆఫర్‌.. 128GB స్టోరేజ్ Galaxy F15 5G మొబైల్‌ను సంగం ధరకే పొందండి!

Samsung Galaxy F15 5G Price Dropped In India: అతి తక్కువ ధరకే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు ఫ్లిఫ్‌కార్ట్‌లో హోలీ సందర్భంగా ఇటీవలే లాంచ్ అయిన సాంసంగ్ గెలక్సీ ఎఫ్15 స్మార్ట్ ఫోన్ సగం ధరకే లభిస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 23, 2024, 10:34 PM IST
Samsung Galaxy F15 5G Price: దిమ్మతిరిగే హోలీ ఆఫర్‌.. 128GB స్టోరేజ్ Galaxy F15 5G మొబైల్‌ను సంగం ధరకే పొందండి!

Samsung Galaxy F15 5G Price Dropped In India: ప్రస్తుతం చాలామంది స్టోరేజ్ అధికంగా ఉండే స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువత అయితే స్టోరేజ్‌తో పాటు ఎక్కువ మెగాపిక్సెల్స్‌ కలిగిన కెమెరా మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే అతి తక్కువ ధరలో మీరు కూడా మంచి కెమెరా, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్‌ని కొనుగోలు చేసేందుకు ఎదురు చూస్తున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన సాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. హోలీ సందర్భంగా.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ సాంసంగ్ కంపెనీకి సంబంధించిన సాంసంగ్ గెలక్సీ ఎఫ్15 (SAMSUNG Galaxy F15 5G) మొబైల్‌ పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను కస్టమర్ ఆకర్షించేందుకు ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా ప్రవేశపెట్టింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ ఏంటో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన సాంసంగ్ గెలక్సీ ఎఫ్15 (SAMSUNG Galaxy F15 5G) స్మార్ట్‌ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపుతో లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లలో రెండు స్టోరేజ్ వేరియంట్స్, మూడు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో 6 జిబి ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 16,999కే లభిస్తోంది. హోలీ సందర్భంగా ఈ మొబైల్ పై ఫ్లిఫ్‌కార్ట్‌ 14 శాతం తగ్గింపుతో కేవలం రూ.14, 499కే అందిస్తోంది. దీంతో పాటు అదనంగా మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. 

బ్యాంక్ ఆఫర్లలో భాగంగా సాంసంగ్ గెలాక్సీస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే రూ. 2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగించి కూడా రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ఉన్నవారు కూడా పేమెంట్ చేసి దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో బ్యాంకుల డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 11,999కే ఈ సాంసంగ్ గెలక్సీ ఎఫ్15 (SAMSUNG Galaxy F15 5G) మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

దీంతోపాటు భారీ డిస్కౌంట్ పొందడానికి ఈ మొబైల్ పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్‌ని కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లలో భాగంగా కొనుగోలు చేసే వారికి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కేవలం సగం ధరకే లభిస్తుంది. ఈ ఆఫర్లలో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా మీరు వినియోగిస్తున్న బ్రాండెడ్ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేసిన తర్వాత మొబైల్ కండిషన్ బాగుంటే రూ. 8.999 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఎక్స్చేంజ్ బోనస్ పోను కేవలం ఈ సాంసంగ్ గెలక్సీ ఎఫ్15 (SAMSUNG Galaxy F15 5G) స్మార్ట్‌ఫోన్‌ రూ.3,000లకే లభిస్తుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News