Samsung Galaxy a55 Price Cut: ఇంతకన్న చీప్‌గా రాదు..అమెజాన్‌లో 256జిబి స్టోరేజ్‌ Galaxy a55 మొబైల్ రూ.5,999కే..

Samsung Galaxy a55 Price Cut: అతి తక్కువ ధరలకే సాంసంగ్ మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం గా భావించవచ్చు అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్ లో భాగంగా సాంసంగ్ గెలాక్సీ a55 (Samsung Galaxy a55) స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 1, 2024, 02:49 PM IST
Samsung Galaxy a55 Price Cut: ఇంతకన్న చీప్‌గా రాదు..అమెజాన్‌లో 256జిబి స్టోరేజ్‌ Galaxy a55 మొబైల్ రూ.5,999కే..

Samsung Galaxy a55 Price Cut: క్రమంగా పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ సాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో చాలావరకు అతి తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. అందుకే యువత ఈ మధ్య ఎక్కువగా సాంసంగ్ మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన సామ్సంగ్ గెలాక్సీ a55 (Samsung Galaxy a55) స్మార్ట్ ఫోన్‌కి మంచి ప్రజాదరణ లభించింది. అతి తక్కువ ధరలోని ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ మార్కెట్లో అమ్మకాల్లో దూసుకుపోతోంది. అయితే ఎప్పటినుంచో మీరు కూడా ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్నారా? ఇదే మొబైల్ సగం కంటే తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ సాంసంగ్ గెలాక్సీ a55 (Samsung Galaxy a55 5G) స్మార్ట్ ఫోన్ విభిన్న స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా రెండు ప్రీమియం కలర్స్ ఆప్షన్లలో లభిస్తోంది. ప్రస్తుతం 8 జిబి ర్యామ్, 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ మార్కెట్లో MRP ధర రూ.45,999కే అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ పై ఉన్న ప్రత్యేకమైన డీల్ లో భాగంగా ఏడు శాతం తగ్గింపుతో రూ.42,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ లో భాగంగా బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి మరింత తగ్గింపు లభిస్తుంది. 

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, 8జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన సాంసంగ్ గెలాక్సీ a55 స్మార్ట్‌ఫోన్‌ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి వారికి అదనంగా రూ.4వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా వన్ కార్డు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ. 2000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక జే అండ్ కే బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించే వారికి కూడా అదనపు తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా పాత స్మార్ట్ ఫోన్‌ను ఇచ్చేసి కొత్త మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో రూ.37 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ Samsung Galaxy a55 మొబైల్ భారీ తగ్గింపుతో కేవలం రూ.5,999కే లభిస్తోంది.

సాంసంగ్ గెలాక్సీ A55 స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్:
డిస్ప్లే:

6.5-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే
1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్
120Hz రిఫ్రెష్ రేట్

ప్రాసెసర్:
5nm Exynos 1280 Octa-core ప్రాసెసర్
Mali-G68 MP4 GPU

ర్యామ్ & స్టోరేజ్:
6GB/8GB ర్యామ్
128GB/256GB స్టోరేజ్
మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించదగినది

కెమెరా:
64MP ప్రధాన కెమెరా
12MP అల్ట్రా వైడ్ కెమెరా
5MP డెప్త్ కెమెరా
5MP మాక్రో కెమెరా
32MP సెల్ఫీ కెమెరా

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
25W ఫాస్ట్ చార్జింగ్

ఇతర ఫీచర్స్:
ఆండ్రాయిడ్ 12
One UI 4.1
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
IP67 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
5G కనెక్టివిటీ

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News