Samsung f23 5g: భారత మార్కెట్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ టెక్ కంపెనీ మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు అని ఎప్పుడు విడుదల చేసిన.. 2 వేరియంట్లలో కస్టమర్లకు అందిస్తుంది. ఒక వేరియంట్ సాధారణ బడ్జెట్ ధరల్లో ఉంటే, ఇంకొక వేరియంట్ ఆత్యాధునిక ఫీచర్లతో భారీ ధరల్లో మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్లు ఐఫోన్ ను మించిన కెమెరా క్వాలిటీ సామర్థ్యం ఉండడం విశేషం. మిడిల్ రేంజ్ వినియోగదారులకు ఇటీవల విడుదల చేసిన శాంసంగ్ ఎఫ్23(SAMSUNG Galaxy F23 5G) చాలా చౌక ధరలో లభిస్తుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ ఎఫ్23(SAMSUNG Galaxy F23 5G) మిడిల్ రేంజ్ వినియోగదారుల కోసం మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే ఇది అత్యాధునిక ఫీచర్లతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి వేరియట్ 6GB ర్యామ్ కలిగినదైతే.. రెండో వేరియంట్ 8GB ర్యామ్ తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక దీని డిజైన్ విషయానికొస్తే వినియోగదారులను ఆకర్షించేందుకు మూడు కెమెరాలతో చాలా రకాల ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. 23,999 కాగా.. ఫ్లిప్కార్ట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కేవలం రూ.15,999లకే విక్రయిస్తోంది. అంతేకాకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 500 ఇనిస్టెంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఎక్స్చేంజ్ ఆఫర్:
ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే.. భారీ డిస్కౌంట్ పొందవచ్చు. కానీ ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ క్లైమ్ చేసుకోవడానికి మీ పాత ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. మీ పాత ఫోన్ బాగుంటే రూ.14,500 దాకా డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో అన్ని ఆఫర్లు డిస్కౌంట్ పోను ఈ సాంసంగ్ ఎఫ్ 23 కేవలం రూ. 1,000కే లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై చాలా రకాల ఆఫర్లు ఉన్నాయి. మీరు ఫ్లిప్కార్ట్ యొక్క అనుసంధాన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే.. దాదాపు 10 శాతం దాకా డిస్కౌంట్ లభించే అవకాశాలున్నాయి.
Also read: Multibagger shares: రాకెట్ వేగంతో పెరిగిన షేర్, 6 నెలల్లో లక్షకు 25 లక్షల రూపాయలు
Also read: Multibagger shares: రాకెట్ వేగంతో పెరిగిన షేర్, 6 నెలల్లో లక్షకు 25 లక్షల రూపాయలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook