Realme Gt Neo 6: 240W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో పవర్‌ ఫుల్‌ Realme మోడల్‌ రాబోతోంది..ఫీచర్స్‌ ఇవే!

Realme Gt Neo 6 Series Expected Features And Specifications: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌ మీ నుంచి మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. ఇది Realme GT Neo 6 మోడల్‌లో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌ సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 5, 2024, 04:02 PM IST
Realme Gt Neo 6: 240W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో పవర్‌ ఫుల్‌ Realme మోడల్‌ రాబోతోంది..ఫీచర్స్‌ ఇవే!

Realme Gt Neo 6 Series Expected Features And Specifications: ప్రముఖ టెక్‌ కంపెనీ రియల్‌ మీ త్వరలోనే గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో Realme GT Neo 6 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వైరల్‌ అవుతున్న వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌కి సంబంధించిన లాంచింగ్‌ తేదిని కూడా త్వరలోనే ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని టిప్‌స్టర్స్‌ తెలిపారు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Realme GT నియో 6 చిప్‌ సెటప్‌ వివరాలు ఇవే:
చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌తో తెలిపిన వివరాల ప్రకారం..Realme GT నియో 6 చిప్‌ సెటప్‌ ఎంత శక్తివంతమైన మిడ్ రేంజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది టిప్‌స్టర్స్‌ మాత్రం ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 SoCతో కూడిన మోడల్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే దీనిని కంపెనీ ప్రీమియం ప్రాసెసర్‌తో తక్కువ ధరలోనే లాంచ్‌ చేసే ఛాన్స్‌ ఉందని మరికొంతమంది టిప్‌స్టర్స్‌ తెలిపిపారు. అయితే ఈ మొబైల్ ప్రాసెర్‌కి సంబంధించి పూర్తి సమాచారం కోసం కంపెనీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.  

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పటికీ చాలా సార్లు లీక్‌ అయ్యాయి. ఇంతకు ముందు లీక్‌ అయిన వివరాల ప్రకారం..Realme GT నియో 6 మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్స్‌ తెలిపారు. అంతేకాకుండా ఈ మోడల్‌లు 1.5K రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు టిప్‌స్టర్‌ క్లారీటి ఇచ్చారు. దీంతో ఈ Realme GT నియో 6  స్మార్ట్‌ఫోన్స్‌ 50MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ కూడా ఉందని తెలిపారు. 

లీక్‌ అయిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ప్రదర్శన (Display):

6.74 అంగుళాల (17.12 సెం.మీ) AMOLED డిస్‌ప్లే
1240 x 2772 పిక్సెల్‌లు రిజల్యూషన్ (451 పిపిఐ)
144Hz రిఫ్రెష్ రేట్

పనితీరు (Performance):
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్
8GB ర్యామ్
256GB స్టోరేజ్

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

కెమెరా (Camera):
వెనకవైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్
50MP ప్రధాన కెమెరా
8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
2MP అదనపు కెమెరా
16MP ముందు కెమెరా

బ్యాటరీ (Battery):
4600mAh బ్యాటరీ
240W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్

ఇతర ఫీచర్లు (Other Features):
Android 13 ఆపరేటింగ్ సిస్టమ్
5G కనెక్టివిటీ
NFC

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News