Realme C63: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ త్వరలోనే భారత కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలుపబోతోంది. గతంలో విడుదల చేసిన C సిరీస్ స్మార్ట్ ఫోన్ లకు సక్సెసర్ గా త్వరలోనే మరో సిసిరీస్ మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ మొబైల్ కు సంబంధించిన మోడల్ నెంబర్ ను కూడా ఇండోనేషియా టెలికాం వెబ్సైట్‌లో నమోదు చేసింది. దీనిని కంపెనీ Realme C63 మోడల్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ మొబైల్ కు సంబంధించిన వివిధ వివరాలు ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ డేటా బేస్ లో కూడా ఇటీవలే కనిపించాయి. దీన్నిబట్టి చూస్తే ఈ మొబైల్ అతి త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ విడుదలకు ముందే దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన లీకైన వివరాలేంటో మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Realme C63 స్మార్ట్‌ఫోన్ భారతలో RMX3939 మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ దీనిని అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల చేసే యోచనలో ఉంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన గ్లోబల్ లాంచింగ్‌లో భాగంగా ఇది RMX3910 మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే కంపెనీ BIS ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసింది.
ఇక ఈ Realme C63 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది ఎంతో శక్తివంతమైన 4,880mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు దీని ఛార్జింగ్ కోసం 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాంక్ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు అదనంగా మైక్రో కెమెరా కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ ఫ్రంట్ భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS ఆధారిత Realme UI 5.0 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై రన్ అయ్యే ఛాన్స్ ఉందని టిప్‌స్టర్స్ తెలుపుతున్నారు. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో ఈ మొబైల్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రియల్‌మీ త్వరలోనే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనుంది.
రియల్ మీ సి63 లీక్ టాప్ ఫీచర్స్
పనితీరు:
6.7-అంగుళాల AMOLED డిస్ప్లే (120Hz రిఫ్రెష్ రేట్)
Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్
12GB RAM + 256GB స్టోరేజ్
4,880mAh బ్యాటరీ (80W ఛార్జింగ్)
Android 12 ఆపరేటింగ్ సిస్టమ్
కెమెరా:
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
50MP ప్రధాన కెమెరా
12MP అల్ట్రా-వైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
32MP సెల్ఫీ కెమెరా
ఇతర ఫీచర్స్:
5G కనెక్టివిటీ
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డ్యూయల్ స్పీకర్లు
హై-రిజల్యూషన్ ఆడియో
IR బ్లాస్టర్
డిజైన్:
స్లిమ్, లైట్‌వెయిట్ డిజైన్
గ్లాస్ బ్యాక్ , మెటల్ ఫ్రేమ్
వేర్వేరు రంగు ఎంపికలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి